టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ ఈమేజ్ కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తారక్ నటించిన సినిమాలకు హిట్టు , ఫ్లాపు టాక్ తో సంబంధం లేకుండా అద్భుతమైన కలెక్షన్లు వస్తూ ఉంటాయి. తారక్ , రాజమౌళి దర్శకత్వంలో కొంత కాలం క్రితం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ ద్వారా తారక్ కి గ్లోబల్ గా క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తర్వాత నుండి ఈయన క్రేజ్ భారీ ఎత్తున పెరిగిపోయింది. దానితో తారక్ నటించిన సినిమాలకు భారీ ఎత్తున కలెక్షన్స్ కూడా వస్తున్నాయి.

ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత తారక్ నటించిన దేవర పార్ట్ 1 సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్లను కాబట్టి మంచి విజయాన్ని కూడా అందుకుంది. తాజాగా తారక్ "వార్ 2" అనే హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి నెగటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అలాంటి సమయం లో కూడా తారక్మూవీ తో ఓ రికార్డును కొట్టాడు. అదేమిటో తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయిన వార్ 2 నార్త్ అమెరికాలో మాత్రం అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది.

ఇప్పటివరకు నార్త్ అమెరికాలో వార్ 2 మూవీ కి ఏకంగా 4 మిలియన్ డాలర్ల కలెక్షన్లు అందినట్లు తెలుస్తోంది. ఇలాంటి టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్లను అందుకోవడం మామూలు విషయం కాదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. వార్ 2 మూవీ లో తారక్ తో పాటు హిందీ నటుడు హృతిక్ రోషన్ కూడా నటించాడు. ఇది ఇలా ఉంటే వరుసగా తారక్ నటించిన ఆర్ ఆర్ ఆర్ , దేవర పార్ట్ 1 , వార్ 2 మూవీ లు నార్త్ అమెరికాలో 4 మిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: