
ఆఖరి పోరాటం సినిమాలో నాగార్జున హీరో గా నటించగా శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. రాఘవేందర్రావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అశ్విని దత్ నిర్మించారు. మొదట ఈ సినిమాను నాగార్జునతో కాకుండా చిరంజీవితో చేయాలి అని అనుకున్నారట. అందులో భాగంగా చిరంజీవిని సంప్రదించగా ఆయన కూడా మొదట ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక అంత ఓకే అయ్యే షూటింగ్ మొదలు పెడదాం అనుకునే సమయానికి చిరంజీవి చాలా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ప్రస్తుతం నేను ఈ సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో వెంటనే నాగార్జునను సంప్రదించగా ఆయన ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దానితో నాగార్జున హీరో గా శ్రీదేవి హీరోయిన్గా ఈ మూవీ ని ఆఖరి పోరాటం అనే టైటిల్ తో రూపొందించారట. ఈ మూవీ విడుదల అయ్యి అద్భుతమైన కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో నాగార్జునకు మొదటి కమర్షియల్ విజయం దక్కడం మాత్రమే కాకుండా అద్భుతమైన గుర్తింపు కూడా దక్కింది. అలా చిరంజీవి రిజెక్ట్ చేసిన మూవీ తో నాగార్జునకు మొదటి కమర్షియల్ విజయం దక్కినట్లు తెలుస్తోంది.