మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం క్రితం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మొదలు పెట్టిన తర్వాత ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన  విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన సందర్భంలో ఈ మూవీ కి సంబంధించిన అత్యంత గ్రాఫిక్స్ పనులు పెండింగ్లో ఉన్నాయి అని , దానితో ఈ సినిమా విడుదల అనేది ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన వీరు కాదు అని , ఈ మూవీ కొత్త విడుదల తేదీని మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తాం అని మేకర్స్ ప్రకటించారు.

ఈ చిత్ర బృందం ఈ మూవీ కి సంబంధించిన ఓ టీజర్ ను చాలా కాలం క్రితం విడుదల చేసింది. ఆ మూవీ టీజర్ పై పెద్ద ఎత్తైన విమర్శలు వెల్లువెత్తాయి. దానితో ఈ మూవీ దర్శకుడు అయినటువంటి వశిష్ట ఈ సినిమా నుండి మొదట విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సినిమా మాత్రం అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన మరో టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ రెండవ టీజర్ లోని గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండడం , మ్యూజిక్ కూడా సూపర్ గా ఉండడంతో ఒక్క సారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఈ మధ్య కాలంలో సినిమా విడుదలకు చాలా రోజుల ముందు ఓ టి టి డీల్ జరగడం తగ్గిపోయింది. కొన్ని క్రేజీ సినిమాలకు మాత్రమే ఓ టి టి డీల్ విడుదలకు చాలా రోజుల ముందు క్లోజ్ అవుతుంది. ఇక విశ్వంబర మూవీ యొక్క ఓ టీ టీ తాజాగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను జియో హాట్ స్టార్ సంస్థ వారు భారీ దరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. విశ్వంభర మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: