సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు ఒకే సమయంలో విడుదల అయినట్లయితే ఆ సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఏ హీరో సినిమా ఎక్కువ కలెక్షన్లను వసూలు చేస్తుంది ..? ఏ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుంది అనే ఆసక్తికరమైన చర్చలు ఆ సమయంలో జరుగుతూ ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో చిరంజీవి , పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ ముందు వారసులు ఉంటారు. వీరి సినిమాలు చాలా సార్లు పోటీ పడ్డాయి. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన విశ్వంభర మూవీ ని జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు.

ఇక బాలకృష్ణ హీరో గా రూపొందిన డాకు మహారాజ్ సినిమాను కూడా ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉంటుంది అని చాలా మంది అనుకున్నారు. అలాంటి సమయంలోనే చిరంజీవి హీరో గా రూపొందుతున్న విశ్వంభరా మూవీ సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది. దానితో బాలకృష్ణ , చిరంజీవితో కాకుండా ఈ సారి సంక్రాంతి బరిలో వేరే హీరోలతో పోటీ పడవలసి వచ్చింది.

ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న ఓజి మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే తేదీన బాలకృష్ణ హీరో గా రూపొందుతున్న అఖండ 2 మూవీ ని కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది అని చాలా మంది అనుకున్నారు  అలాంటి సమయంలోనే అఖండ 2 మూవీ యూనిట్ ఈ సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయడం లేదు అని , కొత్త విడుదల తేదీని మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామని అధికారికంగా ప్రకటించింది. దీనితో ఈ సంవత్సరం ఒక సారి చిరంజీవి తప్పుకుంటే, మరో సారి బాలకృష్ణ రేస్ నుండి తప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: