`డీజే టిల్లు` మూవీతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది నేహా శెట్టి. అంతకుముందు పలు సినిమాలు చేసింది. కానీ సక్సెస్ మాత్రం వ‌రించ‌లేదు. 2022లో వ‌చ్చిన డీజే టిల్లులో రాధికగా ఫుల్ పాపులర్ అయింది. ఒక్క మూవీతో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. కెరీర్ లోనే బిగ్ హిట్ ను కూడా సొంతం చేసుకుంది. డీజే టిల్లు తర్వాత రాధిక టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అవుతుందని.. స్టార్ హీరోయిన్ల చెంత చేరుతుందని చాలా మంది భావించారు.


బ‌ట్ కథల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా నేహా శెట్టి వరస ఫ్లాపుల‌ను మూటగ‌ట్టుకుంది. గ‌త ఏడాది `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి` చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది. ఆ తర్వాత నేహా శెట్టి నుంచి మరొక సినిమా రాలేదు. కొత్త ప్రాజెక్టుల అనౌన్స్మెంట్స్‌ కూడా లేవు. అయితే చేతిలో సినిమాలు లేక అల్లాడిపోతున్న టిల్లు పాపకు తాజాగా లక్కీ ఛాన్స్ వ‌రించింది. ఈ అమ్మడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని లైన్ లో పెట్టేసింది.


ప్రస్తుతం పవన్ సుజీత్ దర్శకత్వంలో `ఓజీ` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి కాకముందే ఈ సినిమా పై విపరీతమైన బ‌జ్‌ ఏర్పడింది. ఫాన్స్ పవన్ కనిపిస్తే చాలు ఓజీ ఓజీ ఓజీ అంటూ తెగ హంగామా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా.. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా న‌టిస్తున్నారు. అలాగే నేహా శెట్టి కూడా ఓజీలో యాక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకుంది. ఆమె ఒక చిన్న క్యారెక్టర్ తో పాటు స్పెషల్ సాంగ్ లో అలరించబోతుందని ఫిల్మ్ స‌ర్కిల్స్ లో జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. నేహా శెట్టి షూటింగ్ లో కూడా జాయిన్ అయింద‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: