కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అట్లీ ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలకే దర్శకత్వం వహించిన దర్శకత్వం వహించిన ప్రతి సినిమాతో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకొని అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్నాడు. అట్లీ "రాజా రాణి" అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ ని మినహాయిస్తే ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలే. వీటి ద్వారానే ఆయన మంచి విజయాలను అందుకున్నాడు.

అట్లీ సినిమాలో కథ ఏ మాత్రం కొత్తగా ఉండదు అని , స్క్రీన్ ప్లే కూడా పెద్దగా కొత్తగా ఉండదు కానీ , ఎమోషనల్ సీన్లను ఆయన బాగా తెరకెక్కిస్తాడు. దానితో ఆయన మంచి విజయాలను అందుకుంటున్నాడు అనే అభిప్రాయాలను వ్యక్తం చేసిన వారు కూడా ఉన్నారు. ఇకపోతే అట్లీ కొంత కాలం క్రితమే బన్నీ హీరో గా ఓ సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రమోషనల్ వీడియోలను కూడా ఇప్పటికే మేకర్స్ విడుదల చేశారు. వాటి ద్వారా ఈ సినిమా అట్లీ పూర్వపు మూవీల మాదిరి ఉండదు. ఇది భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతుంది. ఈ సినిమా కథ , కథనాలు అన్ని సరి కొత్తగా ఉంటాయి అని జనాలు అంచనా వేసుకుంటూ వచ్చారు.

తాజాగా ఈ మూవీ లో తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు నటించబోతున్నాడు అనే ఓ వార్త వైరల్ అవుతుంది. యోగి బాబు ఉన్నాడు అంటే సినిమాలో కామెడీ ఉంటుంది. దానితో అట్లీ మళ్లీ బన్నీ తో కూడా ఏదైనా కమర్షియల్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాడా ..? ఈ సినిమాలో కూడా అట్లీ పూర్వపు సినిమాల మాదిరి కథ , కథనాలు ఉంటాయా అనే అనుమానాలు కొంత మంది లో మొదలయ్యాయి. మరి బన్నీ , అట్లీ కాంబో మూవీ ఎలా ఉంటుంది అనేది తెలియాలి అంటే ఇంకా చాలా కాలం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa