టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాడు అంటే చాలు ఆ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే రేంజ్ అంచనాలు నెలకొంటూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని చాలా కాలమే అవుతుంది. కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ "హరిహార వీరమల్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదిరిపోయే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా పవన్ ప్రస్తుతం నటిస్తున్న ఓజి సినిమాపై అత్యంత భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదల అయిన ప్రచార చిత్రాలన్నీ కూడా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నాయి. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేనున్నారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో డీజే టిల్లు మూవీ లో హీరోయిన్ నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్లో కనిపించబోతున్నట్లు , ఇప్పటికే ఈమెపై స్పెషల్ సాంగ్ ను కూడా షూట్ చేసినట్లు , అది అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఈ వార్త వైరల్ అవడంతో కొంత మంది ఇప్పటికే ఓజి సినిమాపై అదిరిపోయే రేంజ్ అంచనాలు ఉన్నాయి. పవన్ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో స్టైలిష్ లుక్ లో కనబడుతున్నాడు. ఎన్ని స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్న ఈ సినిమాలో మళ్లీ స్పెషల్ గా స్పెషల్ సాంగ్ ఎందుకు అనే వాదనను కొంతమంది వినిపిస్తున్నారు. మరి కొంత మంది మాత్రం సినిమాలో స్పెషల్ సాంగ్ కి సూచివేషన్ ఉన్నప్పుడు దానిని పెట్టడం మంచిదే అని వాదనను వినిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk