
అయితే, ఇటీవల కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలో భర్తతో కలిసి ప్రతి పండుగ, ఈవెంట్‌లో జంటగా కనిపించిన ఈ బ్యూటీ, ఇప్పుడు అన్ని ఫంక్షన్లకు ఒంటరిగా హాజరవుతూ వస్తోంది. భర్త పేరు ప్రస్తావించడమే కాదు, అతని ఫోటోలు కూడా షేర్ చేయడం మానేసింది. ఈ మార్పుతో సినీ అభిమానులు, నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ, వీరి వివాహ జీవితంలో ఏదో పెద్ద సమస్య నడుస్తోందని ఊహించారు. సోషల్ మీడియాలో వీరి మధ్య దూరం పెరిగిందని, విడాకుల దిశగా వెళ్తున్నారని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
సాధారణంగా, ఈ హీరోయిన్ గురించి ఏ చిన్న నెగిటివ్ వార్త వచ్చినా వెంటనే సోషల్ మీడియాలో స్పందించే అలవాటు ఉంటుంది. కానీ ఈసారి మాత్రం పెద్ద విషయం పక్కన పెట్టి నిశ్శబ్దంగా ఉండడం, మరింత సందేహాలకు తావిచ్చింది. అంతేకాదు, సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ భామ తన పాత బాయ్‌ఫ్రెండ్‌తో మళ్లీ సన్నిహితంగా ఉంటోందట. ఆ వ్యక్తి కూడా ఒక స్టార్ హీరో. వీరిద్దరూ తరచుగా కలుస్తూ, బయటికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారన్న రూమర్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. ఇలాంటి వార్తలు బయటికొచ్చిన తర్వాత అభిమానుల ఆగ్రహం మరింతగా పెరిగింది.
“నీకు ఉన్న బంగారు లాంటి భర్తను పక్కన పెట్టి ఆ హీరోతో టైమ్ పాస్ చేస్తున్నావా?”, “అసలు నీకు బుద్ధుందా..? నువ్వు జగత్ కంత్రి లా నటిస్తున్నావు ..? నువ్వు నిజానికి నమ్మకద్రోహి!” అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈమెపై వ్యంగ్య మీమ్స్, హేట్ఫుల్ పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి సినీ ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్స్ కొత్తేమీ కాదు. స్టార్ హీరోలు, హీరోయిన్ల వ్యక్తిగత జీవితంపై ఎప్పుడూ పుకార్లు రచ్చ రేపుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఈ ట్రోలింగ్‌కు ఎలా రియాక్ట్ అవుతుందో, వాస్తవానికి ఈ పుకార్లలో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది.