మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 22 వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుండి మేకర్స్ ఒక చిన్న గ్లిమ్స్ వీడియోని విడుదల చేశారు. ఇందులో చిరంజీవి కోట్ సూటు వేసుకొని అదిరిపోయే రేంజ్ స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ఇక ఈ మూవీ గ్లిమ్స్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఈ మూవీ దర్శకుడు అయినటువంటి అనిల్ రావిపూడి అధికారికంగానే ప్రకటించాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్మూవీ షూటింగ్ లో సెప్టెంబర్ 3 వ తేదీ నుండి జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఎం ఎస్ జి లో వెంకటేష్ పోర్షన్ చిత్రీకరణను సెప్టెంబర్ 3 వ తేదీ నుండి ఈ మూవీ బృందం వారు స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చిరు , వెంకటేష్ ఇద్దరు కూడా ఒక హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ షెడ్యూల్ కు సంబంధించిన పనులు చక చక జరుగుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి హీరో గా నటిస్తున్న మూవీ కావడం , దానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూ ఉండడం అందులో విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించనుండడంతో మన శంకర వర ప్రసాద్ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: