ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల చాలామంది దర్శకనిర్మాతలు ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని, వారి సినిమాలకు ఆదరణ కరువైందని వాపోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో విడుదలై, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత నాగవంశీ పంపిణీ చేసిన 'కొత్తలోక' అనే సినిమా మాత్రం ఈ అభిప్రాయాలన్నింటినీ పటాపంచలు చేసింది. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో, ప్రేక్షకాదరణ విషయంలో సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా దూసుకుపోతోంది.

ఈ సినిమాకు ఉన్న ఆదరణకు నిలువెత్తు సాక్ష్యం ఏమిటంటే ఆదివారం రోజున హైదరాబాద్ నగరంలో ఒక్క టికెట్ కూడా లభ్యం కాలేదంటే దాని విజయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది సినిమా పరిశ్రమకు కొత్త ఆశాకిరణంలా మారింది. ఒక మంచి కథ, బలమైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరిస్తారని 'కొత్తలోక' మరోసారి రుజువు చేసింది. థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయని బాధపడుతున్న సినీ పారిశ్రామికవర్గానికి 'కొత్తలోక' సినిమా విజయం గొప్ప ఊరటనిచ్చింది. ఈ సినిమా విజయం మరిన్ని మంచి సినిమాలు రావడానికి స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం.

కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో సూపర్ పవర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన  ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.  ఫుల్ రన్ లో  ఈ సినిమా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. రోజురోజుకు ఈ సినిమాకు థియేటర్ల కౌంట్ పెరుగుతోంది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన కొత్తలోక మూవీ ఈ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందని ఎవరూ  ఊహించలేదు.

దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ  సినిమా బడ్జెట్ కేవలం 35 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.  ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల కంటే  చిన్న సినిమాలే ఎక్కువగా అద్భుతాలు చేస్తున్నాయి. కొత్తలోక సక్సెస్  టాలీవుడ్  ఇండస్ట్రీకి సైతం ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. కొత్తలోక సినిమాలో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: