
ఇక పవన్ నుంచి ఈ నెల 25న రిలీజ్ కాబోతోన్న ఓజీ సినిమా నుంచి ఈ రోజు సాయంత్రం బిగ్ ట్రీట్ ఉంటుందని దర్శకుడు సుజిత్ కన్‌ఫార్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ముందే ఈ రోజు ఉదయమే ఓ పోస్టర్ రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. దీనికి అనుగుణంగా నే ఓ పోస్టర్ కూడా వదిలారు. ఓజి మేకర్స్ ఇపుడు ఆ స్పెషల్ పోస్టర్ ని పవన్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పవన్ తన కెరీర్ లో ఎప్పుడూ లేనంత కూల్‌గా.. స్టైలీష్ గా కనిపించారు. వింటేజ్ డాడ్జ్ కార్ మీద కూర్చున్న స్టైలిష్ ఓజి ఓ వైపు కార్ కింద గమనిస్తే రక్తపాతం కనిపిస్తుంది. ఇలా రక్తపాతం తర్వాత సేద తీరుతూ కనిపించిన ఈ క్రేజీ పోస్టర్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు