మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ నటి మణులలో ఒకరు అయినటువంటి జూన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె హిందీ తో పాటు తెలుగు సినిమాల్లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తోంది. అందులో భాగంగా ఈమె ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది.

మరికొన్ని రోజుల్లోనే దేవర పార్ట్ 2 మూవీ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా కనిపించబోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా రూపొందుతున్న పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా జాన్వి కపూర్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఈమె పిల్లల గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా జాన్వి కపూర్ నాకు ముగ్గురు పిల్లలు కావాలి అని చెప్పింది. అందుకు గల కారణాలు వివరిస్తూ ... ఒక వేళ ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే వారిద్దరూ ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అదే ముగ్గురు పిల్లలు ఉన్నట్లయితే ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. అలాగే నా లక్కీ నెంబర్ మూడు. అందుకే నాకు ముగ్గురు పిల్లలు ఉండాలి అని అనుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా జాన్వి కపూర్ హిందీలో పరం సుందరి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తాజాగా విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

jk