సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది. తమ అభిమాన హీరోల కోసం అభిమానులు చేసే ఓవర్ యాక్షన్స్‌కి హద్దులు మీరిపోతున్నాయి. మరీ ముఖ్యంగా, తమకు అసలు సంబంధం లేని విషయాలల్లో కూడా పట్టించుకుని, వాటిపై కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు అలాంటి హాట్ టాపిక్‌గా మారింది ఒక కోలీవుడ్ స్టార్ హీరో సినిమా వ్యవహారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కోలీవుడ్ సూపర్‌స్టార్ పేరు తెగ చక్కర్లు కొడుతోంది. ఆయన బ్యాక్ టు బ్యాక్‌గా తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ, మంచి విజయాలు అందుకుంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ డైరెక్టర్లలో చాలామంది టాలీవుడ్‌లో టాప్ లీగ్‌లో లేని టైర్-2 డైరెక్టర్లు. గతంలో వీళ్ళ  రికార్డులు అంత బాగాలేకపోయినా, ఈ హీరో వారిపై నమ్మకం ఉంచి వరుసగా అవకాశాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు.


ఇదే విషయాన్ని గమనించిన నెటిజన్లు, సోషల్ మీడియాలో తెలుగు హీరోలపై సెటైర్లు వేస్తూ, ఘాటు కామెంట్లు చేస్తున్నారు. "మన తెలుగు హీరోలు ఎందుకు ఇలాంటి రిస్క్‌లు చేయడం లేదు?", "ఎందుకు కొత్త కథలకు, కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం లేదు?" అంటూ రకరకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఈ కోలీవుడ్ హీరోని ప్రశంసిస్తూ, "ప్లాప్ డైరెక్టర్లకి కూడా ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టడమే అసలైన కిక్!" అని తెగ పొగిడేస్తున్నారు. ఇక మరోవైపు, కొందరు అభిమానులు ఈ విజయాల వెనుక కారణం కథల బలం అని చెబుతుంటే, మరికొందరు మాత్రం ఈ స్టార్ హీరోకు ఉన్న క్రేజ్, మార్కెట్ వల్లే సినిమాలు హిట్ అవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఈ చర్చల వల్ల సోషల్ మీడియాలో కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ డిబేట్ కొత్త ఎత్తుకు చేరింది.



తాజాగా ఈ స్టార్ హీరోతో సినిమా చేసే మరో తెలుగు డైరెక్టర్ పేరు బయటకు రాగానే, సోషల్ మీడియాలో మరోసారి ట్రోలింగ్ పెరిగింది. "మన హీరోలు ఏమాత్రం రిస్క్ తీసుకోరా?", "అభిమానుల క్రేజ్ ఉంటే డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం అంత కష్టం ఏమిటి?" అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు పెడుతున్నారు. ఈ కోలీవుడ్ హీరో ఈ మధ్య కాలంలో వరుసగా తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్న విషయం టాలీవుడ్ ఫ్యాన్స్‌ను ఆలోచనలో పడేస్తోంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్‌గా మారింది.  తమ హీరోలు కొత్తవారికి ఛాన్స్ ఇవ్వకుండా అదే జానర్, అదే ఫార్ములాతో సేఫ్ గేమ్ ఆడుతున్నారని చాలామంది ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ కోలీవుడ్ హీరో ధైర్యాన్ని, కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించే విధానాన్ని ప్రశంసిస్తూ చాలామంది అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పక్కగా చెప్పాలి అంటే చాలా దారుణంగా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. పోయి సాల్డ్ అండ్ పెప్పర్ వేసి వాడి సంక నాకండి..అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ కోలీవుడ్ స్టార్ తీసుకున్న  ఈ నిర్ణయాలు తెలుగు ఇండస్ట్రీలో చర్చకు దారి తీసి, హీరోల కధల  ఎంపికలపై ఫ్యాన్స్ కొత్త కోణంలో ఆలోచించేలా చేశాయి. ఈ చర్చలు, డిబేట్స్‌, ట్రోలింగ్—అన్ని కలిపి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: