“దే కాల్ హిమ్ ఓజీ” విడుదల కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, మొత్తం తెలుగు ప్రజలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా, సుజీత్ దర్శకత్వం వహించారు. హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఓజీ సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఉత్తర అమెరికాలో ప్రీమియర్ షోస్ కోసం టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 40 వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఉత్తర అమెరికాలోనే ఇప్ప‌టికే ఒక మిలియన్ డాలర్ల గ్రాస్‌ను దాటడం పవన్ కళ్యాణ్ స్టార్ పవర్‌ను మరోసారి ఫ్రూవ్ చేసిన‌ట్ల‌య్యింది.


ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు మంచి స్పందన వస్తుందనే అంచనాలు ఉన్నాయి. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా ఓజీ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు స్వరాలందించారు. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ఇప్పటికే మంచి అంచనాలు రేకెత్తించాయి. ఓజీలో ప్రముఖ నటులు శ్రీయా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు చూపని ఓ శక్తివంతమైన లుక్‌తో అభిమానుల ముందుకు రాబోతున్నారని ట్రైలర్‌లోనే స్పష్టమైంది. సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు, ప్రీమియర్ సేల్స్ రికార్డులు చూస్తుంటే “ఓజీ” సినిమా బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అనిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: