
ఈ వేడుకలలో అవార్డు అందుకున్న త్రిష ఇలా మాట్లాడుతూ.. 2012 నుంచి తాను సైమా అవార్డుకి హాజరవుతున్నానని ఇది నిజంగా చాలా అభివృద్ధి చెందిందంటూ తెలియజేసింది. ఈ అవార్డు వేడుకలకు రావడం మా ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుందని తెలిపింది త్రిష. నాలుగు సినీ పరిశ్రమలకు సంబంధించి సెలబ్రెటీలు కలుసుకొనే వేదికగా సైమా అభివృద్ధి చెందిందని అందుకే ఈ వేడుకలు చూడడం తనకు ఇష్టం. తమిళ ఇండస్ట్రీలో కేవలం తమిళ అవార్డులు మాత్రమే ఇస్తారు. కానీ సైమా అవార్డులు అందరికీ ఇస్తారు ప్రతి ఒక్కరిని ఇక్కడ చూడవచ్చు . అందుకే నాకు ఇది చాలా ప్రత్యేకమైనది అంటూ త్రిష తెలిపింది.
ఇక్కడ గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి నా ప్రయాణంలో భాగమైన , దర్శకులు ,నిర్మాతలు, నటీనటులకు , సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని తెలిపింది. అలాగే తాను చేసిన కొన్ని చిత్రాలలో ఎన్నో పాత్రలు గుర్తుండిపోయేలా ఉండడం తనకు గర్వకారణం, కొన్ని సినిమాలు తనకి ఎన్నో గొప్ప పాఠాలు నేర్పించాయి. తాను నిజమైన ప్రేమను ఇప్పుడే పొందాను.. నాకు చాలా ఆనందంగా ఉందంటూ తెలిసింది. ఇంకా బాగా నటించడానికి తాను సిద్ధంగానే ఉన్నానని ఎల్లప్పుడు నా వెంటే ఉంటూ నన్ను ప్రోత్సహించిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేకించి ధన్యవాదాలు అంటూ త్రిష తెలియజేసింది. అయితే అభిమానులు మాత్రం త్రిష పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు..త్రిష మాత్రం పెళ్లి విషయాన్ని దాటేస్తే సినిమాలలో నటిస్తూనే ఉంది. మరి ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందొ చూడాలి.