ఇటీవలి కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ వద్ద పరిస్థితి అంతగా బాగాలేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు కూడా ఊహించినంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టడంలో విఫలమవుతున్నాయి. దాంతో ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు కొంత నిరాశ చెందుతూ ఉన్నారు. విదేశీ మార్కెట్లలో, ముఖ్యంగా అమెరికా బాక్స్ ఆఫీస్‌లో కూడా గత కొన్ని నెలలుగా సరైన కలెక్షన్ రికార్డులు నమోదు కాలేదు. పెద్ద సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో తెలుగు సినిమాల ఓవర్సీస్ మార్కెట్ కొంత మాంద్యం దిశగా వెళ్ళిందని అనిపించింది. అయితే, ఈ సైలెంట్ సిట్యువేషన్‌ను పూర్తిగా మార్చేసి, అమెరికా బాక్స్ ఆఫీస్‌లో దుమ్ము రేపిన సినిమా ‘మిరాయ్’. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా, అందమైన నటి రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌పై రిలీజ్‌కు ముందే మంచి అంచనాలు ఉన్నాయి.


నిన్న థియేటర్లలో విడుదలైన వెంటనే ‘మిరాయి’కి అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి సూపర్ హిట్ టాక్‌తో బాక్స్ ఆఫీస్ వద్ద హవా క్రియేట్ చేస్తోంది. తెలుగు సినిమాల నుండి వచ్చిన మరో క్వాలిటీ ప్రాజెక్ట్‌గా దీనిని ప్రేక్షకులు బాగా ప్రశంసిస్తున్నారు. అమెరికా బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే, ‘మిరాయి’ సెన్సేషనల్ ఓపెనింగ్ సాధించింది. రిలీజ్‌కు ముందురోజు ప్రీమియర్స్‌తో కలిపి $700ఖ్ (సుమారు ₹6 కోట్లు) గ్రాస్ కలెక్షన్ సాధించడం మిడ్-రేంజ్ హీరో సినిమాలకు చాలా పెద్ద రికార్డ్. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే వచ్చే ఈ స్థాయి ఓపెనింగ్‌ని తేజ సజ్జ తన ప్రతిభతో సాధించాడంటే అది నిజంగా గర్వకారణం.



శుక్రవారం ఒక్కరోజే సినిమా సుమారు ₹12 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ అందుకుంది. వీకెండ్ లోపు ఈ సినిమా అమెరికాలోనే $1.7 మిలియన్ మార్క్ దాటుతుందని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయి. ఇది మిడ్‌రేంజ్ హీరో సినిమాలకు ఓ బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ‘మిరాయి’ సక్సెస్ తేజ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. గతంలో కంటెంట్-బేస్డ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ, ఈసారి మాస్, క్లాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే కథతో ముందుకొచ్చాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో విజువల్స్, కథా నిర్మాణం, స్క్రీన్‌ప్లే, బీజీఎం అన్నీ వేరే లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమా థియేటర్లలో చూడాలని ప్రేక్షకుల్లో పెద్ద హైప్ క్రియేట్ అయింది.



అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా తేజ సజ్జ పేరు ట్రెండింగ్ అవుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తేజ సజ్జ వంటి యంగ్ హీరోలు కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీని రాసే స్థాయికి ఎదిగారనే విషయం అందరికీ స్పష్టమవుతోంది. ప్రస్తుతం వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది. ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం ఈ సినిమా అవలీలగా ₹100 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటికే సాలిడ్ ప్లేస్ సంపాదించిన ఈ సినిమా, ఇండియాలో కూడా అదే జోరు కొనసాగిస్తే సూపర్ హిట్ రేంజ్ దాటడం ఖాయం. మొత్తం మీద, ‘మిరాయి’ తేజ కెరీర్‌కు గేమ్‌చేంజర్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యంగ్ హీరో తేజ సజ్జ ఈ విజయంతో మిడ్‌రేంజ్ హీరోలలో నెంబర్ వన్ ప్లేస్‌లోకి ఎంటర్ అయ్యాడని అభిమానులు ఆనందంగా చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: