
అంటే స్టార్ కాస్టింగ్ లేకుండా, కంటెంట్ బలం మీద ముందుకు వెళ్లాలనుకుంటున్నాడన్న మాట. సినిమా పూర్తయిన తర్వాతే పబ్లిక్‌కి వివరాలు చెబుతానని నాగ అశ్విన్ డిసైడ్ అయ్యాడట. ఎందుకు ఆలస్యం అవుతోంది కల్కి 2? .. “కల్కి 2”కి మాత్రం సమయం ఉంది. ప్రభాస్ చేతిలో ఇప్పటికే భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. “రాజాసాబ్” షూటింగ్ పూర్తి చేయాలి, “ఫౌజీ” రెడీ చేయాలి, “స్పిరిట్” మొదలు పెట్టాలి. అదీ కాక “సలార్ 2” పనులు కూడా ప్యారలల్‌గా నడుస్తున్నాయి. ఇవన్నీ అయిపోయాకే కల్కి 2 మొదలవుతుంది. అంతేకాదు, స్క్రిప్ట్ విషయంలోనూ నాగ అశ్విన్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. అన్ని కోణాల్లో సంతృప్తి దొరికిన తర్వాతే సెట్స్‌పైకి తీసుకువెళ్తాడు.
బజ్ క్రియేట్ చేస్తున్న సీక్రెట్ మూవీ .. ఈ చిన్న సినిమా గురించి అధికారికంగా ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకపోయినా, ఇండస్ట్రీలో మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. నాగ అశ్విన్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ ఏం చేస్తాడో తెలుసుకోవాలన్న కుతూహలం అంతా ఉంది. ఈ ప్రాజెక్ట్ పక్కా కంటెంట్ మీదనే నడుస్తుందని టాక్ రావడంతో, సినిమా రిలీజ్ అయ్యే సరికి మళ్లీ కొత్త సర్ప్రైజ్ ఇస్తాడని ఫ్యాన్స్ నమ్మకం. ఫైనల్ టాక్ .. “కల్కి 2”కి ఇంకా సమయం ఉన్నా, నాగ అశ్విన్ ఈ గ్యాప్‌లో ఇలాంటి ప్రయోగాత్మక సినిమా చేయడం తెలివైన నిర్ణయమే అని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొత్తవాళ్లతో, కొత్త కథతో వస్తున్న ఈ మూవీ గురించి ఆఫిషియల్ అప్డేట్ వచ్చేసరికి, మళ్లీ నాగ అశ్విన్ పేరు హైలైట్ కావడం ఖాయం.