
దీంతో 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. సెమిస్టర్ పరీక్షలు కూడా బాగా ఆలస్యమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫీ రీయింబర్స్‌మెంట్‌ల కోసం రూ. 7,500 కోట్లు విడుదల చేయాలని కాలేజ్‌లు కోరుతున్నా.. బడ్జెట్‌లో రు. 1200 కోట్లు కేటాయించినా అవి కూడా విడుదల కాని పరిస్థితి. ఆరోగ్య శ్రీ నిధుల విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తమ ఉద్యోగులు రావాల్సిన బకాయిల విషయంలోనూ సమ్మె చేస్తామని వారు చెపుతున్నారు. అటు బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కూడా సిద్ధం అవుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై తరయూ కామెంట్లు చేస్తున్నారు. ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర భూమి, డబ్బు రెండు లేవని చెపుతున్నారు. రాష్ట్రం సంక్షోభంలో ఉందని.. ఆర్థిక సంక్షోభం వల్ల అప్పులు కూడా పుట్టడం లేదని వాపోతున్న పరిస్థితి. కాలేజ్‌లు బంద్ ప్రకటించకపోవడంతో ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్టుల పేరుతో యాజమాన్యాలను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్ టైంలోనూ ఇలాగే చేశారు. ఆసుపత్రిలకు కూడా ఇలాంటి హెచ్చరికలే వెళ్లవచ్చు. వారిని బెదిరించడం కంటే ఎంతో కొంత నిధులు రిలీజ్ చేసి దారిలోకి తెచ్చుకోవడం మంచిదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా రేవంత్ ప్రభుత్వ పాలనలో వస్తోన్న ఆదాయానికి.. చేస్తోన్న ఖర్చులకు పొంతన లేదు. అందుకే ఈ పరిస్థితి దాపురించిందని అంటున్నారు.