కేసీఆర్ తర్వాత తెలంగాణలో అంతటి స్థాయిని సంపాదించుకున్న లీడర్ కేటీఆర్. తండ్రి బాటలో నడుస్తూ రాజకీయాలను అవపోసన పట్టారు. బీఆర్ఎస్ పార్టీని ఏక చక్రాధిపత్యంతో 9 సంవత్సరాల పాటు నడిపించిన నాయకుడు. తండ్రి మాట, రాజకీయ వ్యూహాలు ఇలా ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ తొమ్మిదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించిన కేటీఆర్ ప్రస్తుతం చాలా దిగాలు పడుతున్నారు. ఇతర పార్టీల నాయకులు ఏ మాట అన్నా కానీ తట్టుకోలేకపోతున్నారు. చిన్న చిన్న మాటలకే చిర్రెత్తిపోయి కోర్టు వరకు వెళ్తున్నారు. ఈ విధంగా కేటీఆర్ ఒక పెద్ద నాయకుడిగా వ్యవహరించడం లేదు. ప్రతిదానికి భయపడి పోయినట్టే కోర్టుకు వెళుతూ తనకు తానే చిన్న బుచ్చుకుంటున్నారు.. సాధారణంగా రాజకీయాలంటే అధికార పక్షం, ప్రతిపక్షం అనేది ఉంటుంది. 

ముఖ్యంగా అధికార పక్షంపై ప్రతిపక్షం వాళ్లు, ప్రతిపక్షంపై అధికారపక్షం వాళ్ళు ఏదో ఒక ఆరోపణ చేసుకుంటూనే ఉంటారు. కానీ అది రాజకీయంగానే ఉంటాయి. ఏదైనా వ్యక్తిగతంగా పేరు ప్రస్తావించి కుటుంబాల గురించి ఆరోపణలు చేస్తే ఏ నాయకుడైనా రియాక్ట్ కావాలి. కానీ అలాంటిదేమీ లేకుండా కేటీఆర్ మాత్రం ఊరికే కోర్టుకు వెళుతూ నాయకులపై పరువు నష్టం దావా వేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడిన మాటలు, అవి ప్రసారం చేసిన మీడియా సోషల్ మీడియాపై కోర్టుకు వెళ్లారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని రూ:10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీంతో  బండి సంజయ్ ని కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది.. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ వాంగ్మూలం ఇచ్చిన రోజున కేటీఆర్ పై చాలా ఆరోపణలు చేశారు.. దీంతో అన్ని మీడియా సంస్థలు కవరేజ్ ఇచ్చాయి.

 దీంతో కేటీఆర్  కి కోపమొచ్చింది..బండి సంజయ్ కి లీగల్ నోటీసులు పంపించారు.. దీంతో బండి సంజయ్ అసలు నేను ఇందులో కేటీఆర్ అనే మాట ప్రస్తావించలేదని రిప్లై ఇచ్చారు.. ఈ విధంగా ఎవరు ఏం మాట్లాడినా కోపాన్ని కట్టలు తెంచుకొని కేటీఆర్ కోర్టుకు వెళ్లడం చూస్తే ఆయనకు నాయకుడి లక్షణాలు లేవంటూ కొంతమంది  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..ఆ మధ్యకాలంలో మంత్రి కొండా సురేఖ  వ్యక్తిగతంగా దూషించింది. ఆమె విషయంలో పిటిషన్ వేశారంటే దానికో అర్థం ఉంది.. మిగతా నాయకులు రాజకీయంగా 100 అంటారు.. వారందరిపై కేసులు వేయాలంటే  ఇక కేటీఆర్ రోజు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. గతంలో కేటీఆర్ మిగతా నాయకులను కూడా విమర్శించారు. ఆయన మాటలను బట్టి ఆ నాయకులు కోర్టుకు వెళితే  కేటీఆర్ కు ఎంత పరువు నష్టం దావా పడుతుందో ఆయన అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: