ఏంటి మంచు మనోజ్ వల్ల విష్ణు అన్నిసార్లు తన్నులు తిన్నారా..అందుకే తమ్ముడు మీద కోపం రోజురోజుకి పెరిగి పోతుందా.. ఇంతకీ మనోజ్ వల్ల విష్ణు తన్నులు తినాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..ఒకరి కోసం మరొకరు ఎందుకు తన్నులు తిన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మంచు మనోజ్ తాజాగా మిరాయ్ సినిమాతో హిట్ కొట్టేశారు.ఇక రీసెంట్ గా భైరవం సినిమాలో ఇద్దరు హీరోలతో కలిసి అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ లు ముగ్గురు కలిసి ఈ సినిమా చేసినప్పటికీ యావరేజ్ టాక్ వచ్చింది తప్ప భారి హిట్ అనే టాక్ మాత్రం రాలేదు. కానీ తాజాగా విడుదలైన మిరాయ్ సినిమా మాత్రం మంచు మనోజ్ యాక్టింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది.ముఖ్యంగా మనోజ్ యాక్టింగ్ చూసి చాలామంది నెటిజెన్లు మనోజ్ తండ్రిలాగే అటు హీరోగా ఇటు విలన్ గా రెండు పాత్రల్లో కూడా రాణించగలరు అంటూ మెచ్చుకుంటున్నారు. 

ఎందుకంటే మోహన్ బాబు కూడా విలన్ గా ఇండస్ట్రీ లో తనదైన ముద్ర వేసుకున్నారు.మోహన్ బాబు లాగే మనోజ్ కూడా మంచి స్టార్ అవుతారు అంటూ పొగుడుతున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా మంచు మనోజ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు.అదేంటంటే మనోజ్ చేసిన తప్పు వల్ల విష్ణు దెబ్బలు పడ్డారట. మరి ఇంతకీ ఆ మనోజ్ చేసిన తప్పేంటి అనేది చూస్తే.. మనోజ్,విష్ణు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారట. అలా చదువుకునే సమయంలో చాలామంది టీచర్స్ వీరిని టార్గెట్ చేసేవారట. ఎందుకంటే మోహన్ బాబు అప్పటికే స్టార్ హీరో కాబట్టి మీ డాడీ పెద్ద స్టార్ అని విర్రవీగుతున్నారా.. రెచ్చిపోతున్నారా అంటూ టార్గెట్ చేసి మరీ కొట్టేవారట. అంతేకాదు ఓ ఫ్రెంచ్ టీచర్ అయితే మనోజ్ తప్పు చేస్తే విష్ణుని వాళ్ళ క్లాసులోకి పిలిచి అందరిముందు కొట్టేవారట. ఇక విష్ణు తప్పు చేస్తే మనోజ్ ని విష్ణు క్లాసులోకి పిలిచి అందరి ముందు కొట్టేవారట.

అలా ఒకరు తప్పు చేస్తే మరొకరిని ఫ్రెంచ్ టీచర్ శిక్షించే వాడట. అయితే ఇలాంటి పరిస్థితి విష్ణు మనోజ్ లకే కాకుండా మరో ఇద్దరు బ్రదర్స్ కి కూడా ఎదురయిందట. అయితే ఫ్రెంచ్ టీచర్ చేసే పనికి చెక్ పెట్టాలని కొంతమంది మాట్లాడుకొని గుంపుగా వెళ్లి ఫ్రెంచ్ టీచర్ మీద పడి కొట్టేశారట. అలా చదువుకునే రోజుల్లో అన్న కోసం తమ్ముడు, తమ్ముడి కోసం అన్న దెబ్బలు తిన్నారట. అయితే ఈ విషయాన్ని మంచు మనోజ్ తాజాగా మిరాయ్ మూవీ ప్రమోషన్స్ లో బయట పెట్టారు.ఇక ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో కొంతమంది  నెటిజన్లు ఫన్నీగా మీ అన్న నీవల్ల దెబ్బలు తిన్నాడు కాబట్టే అప్పటి పగ ఇప్పుడు తీర్చుకుంటున్నాడు కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మంచు ఫ్యామిలీలో అడ్డుతెరలు తొలగిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే విష్ణు సినిమాకి మనోజ్, మనోజ్ సినిమాకి విష్ణు ఆల్ ది బెస్ట్ చెప్పడంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు తొలగిపోయాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: