కొంతమంది నటీనటుల అదృష్టం ఓవర్ నైట్ లో చేంజ్ అయిపోతూ ఉంటుంది. వాళ్లు అప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒకే ఒక్క సినిమాతో వస్తుంది. అలా తాజాగా ఈ హీరో పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఎందుకంటే మిరాయ్ మూవీ హిట్ తో ఈ హీరో దశ తిరిగిపోయింది. అదృష్టం మామూలుగా పట్టలేదు. ఈ సినిమా హిట్ తో ఏకంగా 11 సినిమాలకు సైన్ చేశారట.మరి ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే మంచు మనోజ్.. మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మనోజ్ దొంగ దొంగది, శ్రీ,రాజు భాయ్, బిందాస్,ఝుమ్మంది నాదం, వేదం,కరెంట్ తీగ వంటి సినిమాల్లో నటించారు.ఆ తర్వాత కొద్ది రోజులు ఇండస్ట్రీకి లాంగ్ బ్రేక్ ఇచ్చారు.

దాంతో మనోజ్ సినిమాల నుండి తప్పకున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. కానీ భైరవం సినిమాతో మళ్ళీ మనోజ్ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు.ఇక సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమయంలో తన వ్యక్తిగత విషయాలు రెండో పెళ్లి ఇలా కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీకి లాంగ్ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.ఆ తర్వాత ఈ ఏడాది వచ్చిన భైరవం మూవీతో మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన మనోజ్ భైరవం సినిమా తర్వాత వచ్చిన మిరాయ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. మిరాయ్ మూవీలో విలన్ గా నటించి మనోజ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు.ఇక ఈ సినిమాలో మనోజ్ నటనని ప్రశంసించిన చాలామంది మోహన్ బాబు అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారని పొగిడారు.

అయితే తాజాగా ఈ సినిమాలో మనోజ్ యాక్టింగ్ ని చూసిన చాలామంది విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించడంతో ఈయనకు దాదాపు 11 సినిమాల్లో అవకాశాలు వచ్చాయట.అలా ఒకేసారి 11 సినిమాలకు మనోజ్ సైన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే 11 సినిమాలలో అన్ని హీరో పాత్రలు కాదు రెండు మూడు సినిమాల్లో హీరో పాత్రలు వచ్చాయట. మిగిలిన సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించే అవకాశం మంచు మనోజ్ కి ఇచ్చారట. అలా ఒకేసారి 11 సినిమాలకు మంచు మనోజ్ సైన్ చేసినట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే మనోజ్ వెరీ లక్కీ అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఓవర్ నైట్ లో ఈయన దశ తిరిగిపోయినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: