
ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు.. బ్రతుకుతెరువు కోసం ఎక్కడెక్కడికో వెళుతూ ఉన్నారు. పాకిస్తాన్ ,బంగ్లాదేశ్ ,ఆఫ్గనిస్తాన్ వంటి ప్రాంతాలలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉండేవారు.. ఇతర దేశాలకి కూడా వెళ్లి బ్రతుకుతున్నారు.. ఇకపోతే బ్రతుకుతెరువు కోసం పక్క దేశాలకు లేదా పక్క ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు నచ్చిన ఆహారాన్ని మనం తినాలి కానీ మనకు నచ్చని ఆహారం ఎదుటి వ్యక్తి కూడా తినకూడదు అని ఆంక్షలు విధించే హక్కు మనకు లేదు..
ఒకరకంగా చెప్పాలంటే.. నీకు కావాల్సిన ఆహారం నువ్వు అడుగు.. కానీ అవతలి వారిని ఈ ఆహారం తినడానికి వీలు లేదంటూ చెప్పే హక్కు ఎవరికీ ఉండదు ?అది కూడా వారి సొంత దేశంలో.. కానీ ఇప్పుడు ఇలాంటి ఘటన జపాన్ లో చోటుచేసుకుంది. సాధారణంగా జపాన్ దేశంలో పంది మాంసం ఎక్కువగా తింటారు.. అయితే ఈ పంది మాంసం అక్కడ అమ్మడానికి వీలు లేదు, అలా తినడానికి వీలు లేదు.. మా మతాచారాలకు విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి ఆ వ్యాపార సంస్థలో కూడా ఈ పంది మాంసం అమ్మవద్దు అంటూ జపాన్ దేశంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు ప్రవర్తించడం ఆశ్చర్యంగా మారింది.
ఈ విషయాన్ని అక్కడున్నటువంటి జపనీస్ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. మీ ఆహారం మీది మా ఆహారం మాది అనేటువంటి వాదన ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. మా దేశంలోకి వచ్చి మమ్మల్ని వ్యవహారం తినడానికి మీకేం హక్కు ఉంది అంటూ జపాన్ ప్రజలు ముస్లిం సామాజిక వర్గంపై ఎదురుదాడికి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ ఘటన ఎంతవరకు చోటు చేసుకుంటుందో చూడాలి.