ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరితో మాట్లాడినా పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ గురించే చర్చ జరుగుతోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత కొన్ని వారాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల్లోనే కాకుండా మొత్తం ఇండస్ట్రీలోనూ ఒక రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసింది. రిలీజ్‌కు ముందు నుంచే సోషల్ మీడియా అంతా ఓజీ ఫీవర్‌తో హోరెత్తింది. టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ఒక్కొక్కటి వదిలినా ఫ్యాన్స్ మూడ్‌ను మించి హైప్‌ను సృష్టించాయి. చివరికి కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది.


సినిమా చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు చెబుతున్న ఒకే మాట ఏమిటంటే — “మా హీరోను మేము ఏ విధంగా చూడాలని కలలు కన్నమో.. ఆ కలను సుజిత్ డబుల్ డోస్‌లో చూపించాడు.” నిజంగానే పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్, ఆయన స్టైల్, యాక్షన్ సీన్స్ అన్నీ ఫస్ట్ హాఫ్‌లో దుమ్ము రేపాయి. ఆ హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ కారణంగానే అభిమానులు ఓజీ సినిమాను ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూలను చూస్తే, సినిమా ఆల్మోస్ట్ అంతా పాజిటివ్ టాక్‌నే అందుకుంది. నెగిటివ్ టాక్ పెద్దగా ఎక్కడా కనిపించడంలేదు. పవన్ కళ్యాణ్ గురించి ఎప్పటికప్పుడు నెగిటివ్‌గా మాట్లాడే వారు ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నారు.



ఆ మాటలు పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాయి. ఎందుకంటే సినిమా అందుకున్న హిట్టు, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంత బలంగా ఉంది. అయితే కొన్ని రివ్యూలలో ఒకే ఒక్క పాయింట్‌నే హైలైట్ చేస్తున్నారు — అదేంటి అంటే, సెకండ్ హాఫ్‌లో కొంచెం ల్యాగ్ అనిపించిందని. ఫస్ట్ హాఫ్‌లో సుజిత్ చూపించిన పవర్‌ఫుల్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు సెకండ్ హాఫ్‌లో అంత లెవెల్‌లో కనిపించలేదని కొందరు అభిప్రాయం చెబుతున్నారు. ఆ చిన్న లోపం తప్పిస్తే మిగతా సినిమా గురించి నెగిటివ్‌గా చెప్పుకునే ఏ కారణం లేదు.



ఫ్యాన్స్‌లో అయితే ఒక ప్రత్యేకమైన ఎమోషన్ కనిపిస్తోంది. వాళ్లు చెబుతున్నది ఏమిటంటే – “మా హీరో ఇలాంటి పెద్ద మూమెంట్‌ను స్వయంగా థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా ప్రస్తుతం ఆ అవకాశం దక్కలేదు. అదే మాకు బ్యాడ్ లక్” అని అంటున్నారు. అయినా సరే, ఈ సినిమా ఇచ్చిన సంతృప్తి మాత్రం వర్ణించలేనిది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇది మరో కీల మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. నిజంగా ఆ ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేకుండా ఉంటే, ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా గ్రాండ్ స్థాయిలో బ్లాక్ బస్టర్‌గా నిలిచేది అని అందరూ అంగీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: