
ఈ సినిమాకి పెద్ద ప్లస్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్, విలన్ పాత్రలో నటించిన ఇమ్రాన్ హష్మీ విలనిజం, తమన్ మ్యూజిక్ పెద్ద ప్లస్ అయ్యాయి..ముఖ్యంగా తెరపై కనిపించే హీరో పవన్ కళ్యాణ్ అయితే కనిపించని హీరో తమన్ మ్యూజిక్..అలాగే ఈ సినిమాలో కథ ఎక్కువగా లేకపోయినప్పటికీ ఎలివేషన్స్ తోనే సినిమాకి హిట్ టాక్ వచ్చింది. అలాగే డైరెక్టర్ సుజీత్ ఫ్యానిజం ఎలా ఉంటుందో ఓజి సినిమా తెరపై కనిపిస్తుంది. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా శ్రీయ రెడ్డి తన పాత్రకి న్యాయం చేసింది అంటున్నారు సినిమా చూసిన జనాలు.
ఓ జి మూవీ లోని మైనస్లు :
ఓ జి మూవీ ఫస్టాఫ్ బాగున్నప్పటికీ సెకండాఫ్ కాస్త లాగ్ ఉందని అంటున్నారు. అలాగే సినిమాలో కథ పెద్దగా లేకపోయినప్పటికీ ఎలివేషన్స్ తో డైరెక్టర్ కవర్ చేశారు అంటున్నారు. అలాగే డైరెక్టర్ కథ కంటే ఎక్కువగా ఎలివేషన్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టడం సినిమాకి కాస్త మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక మరో మైనస్ ఏమిటంటే సినిమాలో ఎమోషన్స్,ట్విస్టులు ఒక్కటి కూడా లేకపోవడంతో సినిమాకి కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ కి పెద్దగా ప్రాధాన్యత కూడా లేదు. కేవలం హీరోని చూపించడం వరకే సరిపోయింది.అలాగే క్లైమాక్స్ ప్రతి సినిమాలాగే రొటీన్ గా అనిపిస్తుంది.అయితే సినిమాలో కొన్ని మైనస్ లు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఒక పండగ లాంటి సినిమానే.