
ఈ నేపథ్యంలో భారతి అడుగుపెడితే, ఆమెకు ముందున్న పరిస్థితులు మరింత క్లిష్టంగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి బలహీనంగా ఉంది. కూటమి బలంగా ఉన్నా, వైసీపీ క్షేత్రస్థాయిలో బలాన్ని కోల్పోయింది. కేసుల ముప్పు పార్టీ నాయకత్వాన్ని వేధిస్తోంది. పార్టీకి ఒకప్పుడు కట్టుబడి పనిచేసిన కార్యకర్తల శాతం గణనీయంగా తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో పార్టీని ఏకతాటిపై నడిపించడం, భిన్న మనస్తత్వాలున్న నాయకులను కాపాడుకోవడం భారతి ముందు ఉన్న ప్రధాన సవాళ్లుగా నిలుస్తాయి. రాజకీయాల్లో ఇప్పుడు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్న నాయకులే నిలబడగలుగుతున్నారు. కానీ, సౌమ్యురాలిగా పేరున్న భారతి ఆ రీతిలో తట్టుకుని ముందుకు సాగగలరా అన్న సందేహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో మహిళా నాయకత్వాన్ని పెద్దగా అంగీకరించరని వాస్తవం ఉంది. అలాంటప్పుడు భారతి నాయకత్వాన్ని ఒప్పించుకోవడం సులభం కాదు.
ప్రజల్లో ఇమేజ్ పెంచుకోవాలంటే ఆమె కూడా పాదయాత్రలు, బలమైన ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి దిశగా వెళ్లే ధైర్యం, శక్తి ఆమెకు ఉందా అన్న ప్రశ్న మరింత కీలకం. మొత్తంగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతి రాజకీయాల్లోకి వస్తే, పార్టీని ముందుకు నడిపించడం చాలా కష్టమైన పరీక్ష అవుతుంది. మిగతా కాలమే ఈ ఊహాగానాలకు సమాధానం చెబుతుంది.