
పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీలో చేసిన సినిమాలన్నీ కూడా ఎక్కువగా రీమేక్ సినిమాలే. వకీల్ సాబ్ బాలీవుడ్లో పింక్ మూవీ.. భీమ్లా నాయక్ మలయాళం అయ్యప్పనుమ్ కోసియమ్, బ్రో మూవీ తమిళంలో వినోదయ సీతమ్, ఉస్తాద్ భగత్ సింగ్ తమిళంలో తేరి మూవీకి రీమేక్. స్ట్రైట్ సినిమాగా విడుదలైన హరిహర వీరమల్లు సినిమా కూడా డైరెక్టర్ క్రిష్ కథ అందించిన ఎందుకో అభిమానులకు పెద్దగా నచ్చలేదు. అందుకే ఓజి సినిమాపై ఇంత హైప్ ఏర్పడింది.
రన్ రాజా రన్, సాహో వంటి చిత్రాలతో పేరు సంపాదించుకున్న సుజిత్ సినిమా మేకింగ్ విషయంలో హాలీవుడ్ స్థాయిలో చూపిస్తారు. తన పనితనం చూసి అందుకే పవన్ కళ్యాణ్ పిలిచి మరి ఓజి సినిమా అవకాశం ఇచ్చారు.
ఓజి సినిమాకి హైప్ తీసుకురావడంలో సంగీత దర్శకుడు థమన్ చాలా కృషి చేశారని చెప్పవచ్చు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.
ఓజి సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మి విలన్ గా నటించారు .
తమిళ హీరోయిన్ శ్రియా రెడ్డి ఓజి చిత్రంలో కీలకమైన పాత్ర పోషించారు. ఈమె పాత్ర సినిమాకి హైలైట్ గా ఉంటుంది.
ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే ప్రియాంక మోహన్ ఇందులో నటించిన సన్నివేశాలు కూడా అందర్నీ ఆకట్టుకునేలా ఉంటాయి.
నేహా శెట్టి ఇందులో స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుంది.
OG సినిమా గ్లింప్స్ ఎక్కువమందికి రీచ్ అవ్వడానికి ముఖ్య కారణం నటుడు అర్జున్ దాస్ వాయిస్.. సినిమాలో కూడా ఇతని యాక్టింగ్ హైలెట్ గా ఉంటుందట.