
మొదటి షోకే ఈ సినిమా అదిరిపోయే రేంజ్‌లో పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. థియేటర్స్ బయట ఫ్యాన్స్ రియాక్షన్స్ చూస్తే, ఒకే ఒక మాట — “సూపర్ డూపర్ హిట్!”. మొదటి సీన్ మొదలు చివరి ఫ్రేమ్ వరకు ఫుల్ ఎంజాయ్ అవుతున్నారని ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన ప్రత్యేక హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, ఫైట్లు, ఎమోషనల్ సీన్స్ అన్నీ కొత్త ఫ్లేవర్‌తో వచ్చాయి. ముఖ్యంగా ఆయన కత్తి సీన్స్, మాస్ ఎంట్రీలు, స్టైలిష్ ఎలివేషన్స్ ఫ్యాన్స్‌ని ఊపిరి ఆడనీయకుండా చేశాయి. పవన్ కళ్యాణ్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపించిన తీరు, స్క్రీన్ ప్రెజెన్స్ మామూలు విషయం కాదు.
అయితే, ఇక్కడ మరో పేరు కూడా పెద్ద హైలెట్‌గా మారింది. అది ఎవరో కాదు… ఈ సినిమా వెనక నుంచి మాయ చేయించిన అసలైన హీరో మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఈ మధ్యకాలంలో చేసిన సినిమాల్లో మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చినా, ఓజీతో మాత్రం తన కెరీర్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లేశాడు.థమన్ BGM ఒక్కో సీన్‌లో వినిపించినప్పుడు నరనరాల్లో రక్తం మరిగిపోతుంది. ఫైట్ సీన్స్‌కి ఇచ్చిన స్కోర్, ఎమోషనల్ సీన్స్‌కి ఇచ్చిన మ్యూజిక్, హీరో ఎంట్రీలకు ఇచ్చిన ఎలివేషన్స్ అన్నీ వేరే స్థాయిలో ఉన్నాయి. అభిమానులు సోషల్ మీడియాలో ఏకగ్రీవంగా చెబుతున్న మాట – “ఓజీకి తెరపై కనిపించే హీరో పవన్ కళ్యాణ్ అయితే… తెరవెనక కనిపించే హీరో మాత్రం థమన్”.
ఇప్పటికే సోషల్ మీడియాలో #Thaman #OGBGM అంటూ హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఫ్యాన్స్ థమన్‌ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఆయన మ్యూజిక్ ఈ మధ్య కాలంలో సినిమాకి టాక్ మొత్తాన్ని మార్చేస్తోందని, మరింత ఫేమస్ అవుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. సుజిత్ డైరెక్షన్, పవన్ కళ్యాణ్ మ్యాజిక్, థమన్ మ్యూజిక్ — ఈ మూడూ కలిపి ఓజీని బ్లాక్‌బస్టర్ మాత్రమే కాకుండా కల్ట్ మూవీగా మార్చేశాయి అని చెప్పొచ్చు.