
సినిమా చూసిన వారంతా, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా నాన్-ఫ్యాన్స్ కూడా ఒకే విషయం చెబుతున్నారు. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చేలా ఉంది” అనే మాట ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. అయితే, సినిమాలో పవన్ కళ్యాణ్ నటనను పొగడ్తలతో పొగడుతూ వచ్చిన కామెంట్స్‌లో ఒకే ఒక సీన్ ప్రత్యేకంగా హైలైట్ అవుతోంది. అదే ఆయన చేతిలో కత్తి పట్టుకుని చేసిన యాక్షన్ సీక్వెన్స్. ఇప్పటివరకు ఆయన నటించిన ఏ సినిమాలోనూ ఇంత పవర్ఫుల్, ఇంత ఇంటెన్స్ కత్తి ఫైట్ కనిపించలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ సీన్ చూసిన తర్వాత అభిమానులు మైమరచి పోయారు.
ఈ హైలైట్ సీన్స్ విజయానికి మెయిన్ రీజన్ ఇదే. సుజిత్ క్రాఫ్ట్‌ఫుల్ డైరెక్షన్ కి థమన్ ఇచ్చిన థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ..పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఈ మూడు కలయికే ఆ కత్తి ఫైట్ సీన్స్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి.ఇప్పుడే కాదు, రాబోయే రోజుల్లో కూడా ఈ కత్తి ఫైట్ సీన్స్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఐకానిక్ మూమెంట్స్ గా మిగిలిపోతాయని అందరూ భావిస్తున్నారు. ఆయన లాంటి హీరోకే ఇలాంటి సన్నివేశాలు సరిపోతాయని ఫ్యాన్స్ ఫుల్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, “ఓజీ” పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎక్కడ చూసినా ఇప్పుడు ఓజీ గురించే చర్చ. జనాల నరనరాల్లోకి ఎక్కేలా, రక్తం మరింత ఉప్పొంగేలా ఈ సినిమా తీర్చిదిద్దాడని, దర్శకుడు సుజిత్ తన మార్క్ ని రుజువు చేసుకున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు.ఫ్యాన్స్ సోషల్ మీడియాలో “ఓజీ పక్కా బ్లాక్‌బస్టర్” అంటూ సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు.