విశాఖపట్నం పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది స్టీల్ ప్లాంట్..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఈ స్టీల్ ప్లాంట్ చుట్టే తిరుగుతున్నాయి..ఓవైపు కార్మికుల పోరాటం ఆగడం లేదు. ఇంకో వైపు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం ఆగడం లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు అడ్డుకోలేకపోయారు అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరి ఇందులో ఎవరు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ చేయొద్దని అంటున్నారు. ఎవరు చేయాలంటున్నారనే వివరాలు ఇప్పుడు చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని కార్మిక  సంఘాలు నిరసన తెలుపుతూనే ఉన్నాయి. ఇదే తరుణంలో వైసిపి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని కార్మికులకు  సపోర్ట్ గా నిలుస్తోంది. 

ఈ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ రాజకీయ రగడ నడుస్తోంది. నిజంగానే  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని వైసిపి సపోర్ట్ చేస్తుందా లేదంటే మీదికే అలా ప్రవర్తిస్తుందా అనేది చూద్దాం.. విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ పై రెండు పార్టీలు ఎవరి నిర్ణయాలు వారు చెబుతున్నారు. ఇందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  ప్రైవేటీకరణ చేయడానికి వీలులేదు అంటూ, అది ప్రభుత్వ రంగంలోనే నడవాలి అనే తీర్మానాన్ని మండలిలో ప్రవేశపెట్టింది. ఇదే సమయంలో దాన్ని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ ఇలా మాట్లాడుతూ వచ్చింది.

 విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి రూ:11వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చినందుకు నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు చెబుతూ తీర్మానం చేసింది. దీనికి వైసీపీ మద్దతు కూడా అడిగింది. దీంతో వైసిపి నాయకులు మేము ఎల్లప్పుడూ   మద్దతిస్తామని ఒప్పుకున్నారు కానీ, మీరు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం  చేయడానికి మద్దతు ఇవ్వాలని  టిడిపి, జనసేన, బిజెపిలను కోరింది. ఈ విధంగా రెండు అంశాలపై వాగ్వాదం  నడుస్తోంది. ఇలా రెండు పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు   వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి తప్ప, కార్మికులకు మేలు చేసే ప్రయత్నాలు అయితే స్పీడ్ గా జరగడం లేదని రాజకీయ మేధావులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: