
అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సిరీస్ ని రాజేష్ సెలవా డైరెక్ట్ చేయగా దీప్తి గోవిందరాజన్ కథ అందించారు. సెల్వా కార్తీక్ బాలా సహా రచయితలుగా వ్యవహరించిన అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ తమిళ థ్రిల్లర్‌ను రాజేష్ ఎం. సెల్వా దర్శకత్వం వహించారు, దీప్తి గోవిందరాజన్ రచన చేశారు, సెల్వా, కార్తిక్ బాలా సహ రచన చేశారు. టెక్నాలజీ కంట్రోల్లో లేకుండా పోతున్నప్పుడు, కుటుంబ విభేదాల తీవ్రతతో, రిలేషన్స్ బలహీనమవుతున్నప్పుడు, నిజమైన మరియు వర్చువల్ ప్రపంచాల మధ్య గీత కనుమరుగవుతున్నప్పుడు ఎవరిని నమ్మాలనే ప్రశ్న ఈ సిరీస్ లేవనెత్తేలా కనిపిస్తోంది.
ఈ సిరీస్‌తో శ్రద్ధా శ్రీనాథ్ తన ఓటిపి డెబ్యూ చేస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు, వారితో పాటు సంతోష్ ప్రతాప్, చాందిని, శ్యామ హరిణి, బాల హసన్, సుబాష్ సెల్వం, వివియా సంత్, ధీరజ్, మరియు హేమ నటిస్తున్నారు. దర్శకుడు రాజేష్ ఎం. సెల్వా ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ, “ది గేమ్‌తో, మేము సృష్టించే ప్రపంచాలు, మనం జీవించే జీవితాల మధ్య సున్నితమైన గీతను అన్వేషించాలనుకున్నాను. సిరీస్ ఫ్యామిలీ డ్రామా, కాంప్లికేటెడ్ రిలేషన్స్ తో కూడిన ఓ థ్రిల్లర్. హైపర్-కనెక్టెడ్ యుగంలో, ఏదీ కేవలం వర్చువల్‌గా మిగలదు. తెరపై జరిగే విషయం వాస్తవంలోకి చొచ్చుకొస్తుంది, నియంత్రించలేని పరిణామాలతో. ప్రతి మాస్క్ వెనుక ఒక సత్యం దాగి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌తో నా మొదటి తమిళ ఒరిజినల్‌గా నా విజన్ జీవం పోసుకోవడం అత్యంత ఆనందకరమైన అనుభవం.” అన్నారు
శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ, “స్వతంత్ర మహిళగా, అదే సమయంలో గేమింగ్ డెవలపర్‌గా ఉన్న పాత్రలోకి అడుగుపెట్టడం థ్రిల్లింగ్‌గా, సవాలుగా అనిపించింది. నా పాత్ర సృష్టించిన ప్రపంచమే ఆమెకు వ్యతిరేకంగా మారి, ఆమె తప్పించుకోలేని భయంకరమైన వాస్తవంగా మారిన థ్రిల్లర్ జోన్‌లోకి ప్రవేశించడం సవాలుగా అనిపించింది. రాజేష్‌తో కలిసి పనిచేయడం ఈ ప్రయాణాన్ని మరపురానిదిగా చేసింది. నెట్‌ఫ్లిక్స్‌తో, ఈ కథకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అనుసంధానం కావాలని కోరుకున్నాము. అని అన్నారు. ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్ ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది. సిరీస్ అక్టోబర్ 2న స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది.