పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . తనదైన రీతిలో సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు పవన్ . తన అన్నయ్య చిరంజీవి సపోర్ట్ తో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలలో మరో పక్క పాలిటిక్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు . ఇటీవలే డిప్యూటీ సీఎం గా పదవు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజల్లో మంచి పేరును సంపాదించుకుంటున్నాడు . ఈ క్రమంలోనే మరో పక్క సినిమాలలో కూడా రాణిస్తూ తన సత్తా చాటుతున్నాడు . ఇక తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ఓజీ .


సుజిత్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ నేడు అనగా సెప్టెంబర్ 25 వ తారీఖున థియేటర్లలో రిలీజై మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది . టికెట్టు ధర వెయ్యి రూపాయలు ఉన్నప్పటికీ ఫ్యాన్స్ అవేవీ లెక్కచేయకుండా ఈ మూవీ టికెట్లను కొనుగోలు చేస్తున్నారు . ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ ఒక ఎత్తు అయితే తమన్ బిజియం మరొక ఎత్తుగా నిలిచింది . మ్యూజిక్ డైరెక్టర్గా ఫేమస్ అయిన తమ ప్రస్తుత కాలంలో మంచి హిట్ లనును అందుకుంటున్నాడు .


ఈ క్రమంలోనే ఓజి కూడా మరొక సెన్సేషన్ రికార్డ్ గా తమన్ కెరీర్ లో నిలిచిందని చెప్పుకోవచ్చు . ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ జి మూవీ థియేటర్ వీడియోలు వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే ఓ థియేటర్ లో తమన్ మ్యూజిక్ దెబ్బకి స్పీకర్లు ఆగిపోయినట్లు తెలుస్తుంది . సినిమా మధ్యలో తమన్ మ్యూజిక్ సౌండ్ కి స్పీకర్లు బ్లాక్ స్టైల్ అంటూ వీడియో షేర్ చేశారు అభిమానులు . ప్రజెంట్ ఈ వీడియో చెక్కర్లు కొడుతుంది . ఈ వీడియో చూసిన వారంతా తమన్నా..మజాకానా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: