అసెంబ్లీ వేదికగా చిరంజీవిని ఉద్దేశిస్తూ ఎవ్వడు అన్నట్లుగా వ్యంగ్యంగా బాలకృష్ణ మాట్లాడిన మాటలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం సృష్టించాయి. ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్న బాలకృష్ణ అలాగే రాజకీయాల్లో కూడా పేరున్న స్థాయిలో ఉన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి..ఆ జాగ్రత్తలు ఏవి తీసుకోకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దన్నలా వ్యవహరిస్తున్న చిరంజీవిని ఉద్దేశిస్తూ వెటకారంగా మాట్లాడడం మెగా ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు.దీంతో బాలకృష్ణపై చాలామంది మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇక ఇదే అసెంబ్లీలో జగన్ ని సైకో గాడు అని పిలవడంతో వైసిపి కార్యకర్తలు,నేతలు కూడా ఫైర్ అయ్యారు. 

అసలు సైకో ఎవ్వడో అందరికీ తెలుసు.. మెంటల్ సర్టిఫికెట్ ఉంది నీకో జగన్ కో అందరికీ తెలుసు. కావాలంటే నీ మెంటల్ సర్టిఫికెట్ బయట పెడతాం అంటూ బాలకృష్ణ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక జగన్ కి సంబంధించి చిరంజీవికి సంబంధించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఇద్దరి అభిమానులు కోపంగా ఉండడంతో పాటు అనంతపురంలో పెద్ద రచ్చ సృష్టించారు. తాజాగా అనంతపురంలో జగన్ అభిమానులు, మెగా అభిమానులు కలిసి బాలకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.. బాలకృష్ణ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు. ఆయనని అంత అవమానిస్తే చూస్తూ కూర్చుంటామని ఎలా అనుకున్నారు.. 

చిరంజీవి గారిని ఉద్దేశించి ఎవడు అంటూ తూలనాడారు. దీనిపై మేం వ్యతిరేకిస్తున్నాం. వెంటనే బాలకృష్ణ బయటికి వచ్చి చిరంజీవికి క్షమాపణలు చెప్పాల్సిందే..అంటూ బాలకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధం చేసి బాలకృష్ణ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.ఇక మెగా ఫ్యాన్స్ జగన్ ఫ్యాన్స్ కలిసి చేసిన ఈ పని ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. మరి మెగా ఫ్యాన్స్ కోరిక మేరకు బాలకృష్ణ బయటకు వచ్చి చిరంజీవిని క్షమాపణలు కోరుతారా..లేదా ఈ ఇష్యూ ని ఇంకా పెద్దది చేస్తారా.. కూటమిలో చిచ్చు పెడతారా అనేది చూడాలి.అయితే బాలకృష్ణ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడే కాదు గతంలో అక్కినేని తొక్కినేని అంటూ ఏఎన్ఆర్ విషయంలో కూడా మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: