పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి కే ఈ సంవత్స రం రెండు సినిమా ల తో ప్రేక్షకుల ను పలకరించాడు . కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన హరిహర వీరమల్లు అ నే  సినిమా విడుదల అయింది . ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది . ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల  అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోవడం లో విఫలం అయింది . హరిహర వీరమల్లు సినిమా విడుదల అయిన కొంత కాలానికే పవన్ నటించిన ఓజి సినిమా కూడా థియేటర్లలోకి వచ్చింది. 

మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించగా ... సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఓజి సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. విడుదల అయిన మొదటి రోజు నైజాం ఏరియాలో హరిహర వీరమల్లు సినిమాతో పోలిస్తే ఓజి సినిమాకు భారీ ఎత్తున ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. మరి మొదటి రోజు నైజాం ఏరియాలో హరిహర విరమలు సినిమాకు ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి ..? ఓజి సినిమాకు ఏ స్థాయి కలెక్షన్లు వచ్చాయి ..? అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మొదటి రోజు నైజాం ఏరియాలో హరిహర వీరమల్లు సినిమాకు 12.40 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక ఓజి సినిమాకు మొదటి రోజు నైజాం ఏరియాలో 24.45 కోట్ల కలెక్షన్లు దక్కాయి. కేవలం రెండు నెలల గ్యాప్ లో విడుదల అయిన ఈ రెండు సినిమాల మొదటి రోజు నైజాం ఏరియా కలెక్షన్ల విషయంలో అత్యంత వ్యత్యాసం ఉంది. ఇక ఓజి సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ మూవీ ప్రస్తుతం సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: