టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా పేరుపొందిన చిరంజీవి, బాలయ్య గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో చిన్నపాటి వివాదం మొదలైంది. అయితే ఇది మాటల యుద్ధం కాదని ,రాజకీయాలలో కూడా ఈ విషయం ప్రభావం చూపించేలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి టాలీవుడ్ ప్రముఖులను కలిసినప్పుడు చిరంజీవిని అవమానించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో మరొకసారి వివాదంగా మారింది.


చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగి వచ్చారని  ఎమ్మెల్యే  కామినేని మాట్లాడగా.. బాలయ్య ఈ వ్యాఖ్యలను తీవ్రంగా అసెంబ్లీలోనే ఖండించారు. చిరంజీవి నిలదీయడం అబద్ధమని అక్కడ ఎవరూ గట్టిగా అడగలేదు అంటూ బాలయ్య క్లారిటీ ఇచ్చారు. వీటికి తోడు బాలయ్య కొన్ని వ్యాఖ్యలు చేయడంతో.. చిరంజీవి కూడా ఆ వెంటనే పత్రిక ప్రకటన ద్వారా తనపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఈ విషయం సంచలనంగా మారింది. చిరంజీవి ఇలా చెప్పడంతో ప్రముఖ నటుడు ఆర్ నారాయణ మూర్తి కూడా ఈ విషయం పైన స్పందించారు. చిరంజీవి స్పందన 100% నిజం అంటూ వెల్లడించారు.

ఆరోజు జగన్ ని కలిసిన వాళ్లలో తాను కూడా ఉన్నానని.. జగన్ గవర్నమెంట్ ఎవరిని అవమానించలేదని చాలా మర్యాదగా, గౌరవం ఇచ్చి మరి మాట్లాడించారని తెలిపారు నారాయణమూర్తి. గత ప్రభుత్వం సినిమా వాళ్ళను అవమానించలేదు.. చిరంజీవి గారిని అవమానించారని ప్రచారం కూడా తప్పు అంటూ తెలిపారు. చిరంజీవి గారే స్వయంగా సినీ ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించాలని వారి యొక్క నివాసంలోనే సినీ పెద్దలతో  కలిసి మాట్లాడుకున్నాము.. చిరంజీవి గారే సినీ పెద్దగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారని.. చిరంజీవి గారి చొరవ వల్లే ఆరోజు ఆ సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు నారాయణమూర్తి. ప్రస్తుతం సినిమా టికెట్ల ధరలు భారీగా పెంచేస్తున్నారు.. అలా పెంచకూడదని, సామాన్యునికి వినోదాన్ని పంచేది కేవలం సినిమా ఒక్కటే అలాంటి వాటి ధరలు పెంచితే సామాన్యులు ఇబ్బంది పడతారని రెండు ప్రభుత్వాలకు తాను రిక్వెస్ట్ చేస్తున్నానంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: