యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా, దర్శకత్వం పి. మహేష్ బాబు వహించిన “ఆంధ్ర కింగ్ తాలూకా” ఎమోషనల్ ఫ్యాన్ బయోపిక్ జానర్లో వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది. రామ్ ఫ్యాన్స్ భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథను తీసుకుని, ప్రేక్షకులతో కన్నెక్ట్ అయ్యే రీతిలో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. రామ్ కెరీర్లో కొంతకాలంగా నిలదొక్కుకునే హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ సినిమా రావడం, అందులోనూ మంచి టాక్ రావడం ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇచ్చినట్లయ్యింది. సినిమాపై రిలీజ్ బజ్ మొదలైనప్పటి నుంచి సినిమాపై పెద్దగా హైప్ లేకపోయినా, థియేటర్లలోకి వచ్చిన తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ బలంగా పెరిగింది. కథలోని భావోద్వేగాలు, రామ్ నటన, క్లైమాక్స్ బ్లాక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఫ్యాన్స్ జీవితం .. స్టార్ హీరోపై ఉన్న అభిమానం .. హీరో కోసం అభిమానుల త్యాగాలు, సంఘర్షణలు, చివరకు పొందే అప్రతిష్ట లేదా గౌరవం అన్న అంశాలను ఈ సినిమాలో చాలా లోతుగా చూపించారు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా యూఎస్ మార్కెట్లో అదరగొట్టే ఓపెనింగ్స్ అందుకుంది. రిలీజ్ తోనే 2.5 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద మంచి వేగంతో దూసుకెళ్తోంది. వీకెండ్లో మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాఫ్ట్ ఎమోషన్ డ్రామా సినిమాకు విదేశాల్లో వస్తున్న రెస్పాన్స్ మేకర్స్‌కు కాన్ఫిడెన్స్‌ను ఇచ్చింది.
సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ నటన సినిమాకు పెద్ద బలం కాగా, వివేక్ - మెర్విన్ ఇచ్చిన మ్యూజిక్ ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భావోద్వేగానికి మరింత ఎత్తు తీసుకెళ్లింది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ నిర్మాణ విలువలు, టెక్నికల్ వాల్యూస్ పరంగా కూడా సినిమా రిచ్‌గా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి