మెగా క్యాంప్ నుండి వచ్చే సినిమాలపై ఎప్పుడూ స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. ముఖ్యంగా యాక్సిడెంట్ తర్వాత స్లో మోడ్‌లో ఉన్న సాయి ధరమ్ తేజ్ నుంచి వస్తున్న “సంబరాల ఏటి గట్టు”పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో రిలీజ్ డేట్ ఎప్పుడు అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అసలు ఈ మూవీ సెప్టెంబర్ 25నే థియేటర్లలోకి రావాల్సింది. కానీ షూటింగ్ డిలే, పోస్ట్ ప్రొడక్షన్ స్లోగా సాగడం వల్ల ఆ ప్లాన్ కుదరలేదు. ఇదే టైమ్‌లో పవన్ కళ్యాణ్ ఓజీ బ్లాక్‌బస్టర్‌గా దుమ్ము దులిపింది. క్లాష్ అవ్వాల్సిన అఖండ 2 కూడా డిసెంబర్ 5కి షిఫ్ట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు హీరో పుట్టినరోజు సందర్భంగా టీమ్ “అసుర ఆగమనం” పేరుతో ఓ షార్ట్ టీజర్ రిలీజ్ చేసింది.

 ఒక్క నిమిషం వీడియోలోనే దర్శకుడు రోహిత్ కెపి ఒక డార్క్ వాతావరణాన్ని సెట్ చేశాడు. కఠినమైన సూర్యరశ్మిలో తగలబెట్టేలా కనిపించే ఒక ఎడారి ప్రదేశం, ఆ నేలపై ప్రజలు బానిసల్లా బ్రతుకుతున్నారు… ఒక రకంగా నరకాన్ని చూస్తున్నారు. ఆ ప్రాంతంలో అరాచక రాజ్యం నెలకొని ఉంది. ఇదే సమయంలో అక్కడికి అడుగుపెడతాడు ఒక అసుర రూపం ధరించిన యువకుడు… అతడే బలి! బలిగా కనిపించిన సాయి తేజ్ లుక్ అభిమానులను షాక్ లోకి నెట్టింది. గుబురు గెడ్డం, రఫ్ లుక్, స్ట్రాంగ్ బాడీ లాంగ్వేజ్ — ప్రతి ఫ్రేమ్‌లో పవర్ ఫుల్ ఇంపాక్ట్ కనిపించింది. కొన్నిసార్లు చిరంజీవి స్టైల్ రిఫ్లెక్షన్ కూడా కనపడటం ఫ్యాన్స్ కి స్పెషల్ హైలైట్ అయింది.

దర్శకుడు రోహిత్ కెపి, కెజిఎఫ్ తరహాలో డార్క్ వరల్డ్ సెట్ చేసి సాయి తేజ్‌ను ఎలివేట్ చేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అజనీష్ లోకనాథ్ టెన్షన్ క్రియేట్ చేసే మ్యూజిక్‌తో టీజర్ స్థాయిని మరింత పెంచేశాడు. విజువల్స్ లో నేచురల్ షాట్స్‌తో పాటు AI టచ్ కూడా ఉంది. టెక్నికల్‌గా కూడా సినిమా రిచ్ గా కనిపిస్తోంది.సాయి తేజ్ ఈ రోల్ కోసం విపరీతంగా కష్టపడ్డాడు. బలిగా కనిపించేందుకు శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. జిమ్‌లో గడిపిన గంటలు, రగ్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్… టీజర్‌లో దాని ఫలితం స్పష్టంగా కనిపించింది. రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు కానీ ఈ టీజర్‌తో మూవీపై హైప్ బాగా పెరిగిపోయింది. టైటిల్ ‘సంబరాల ఏటి గట్టు’ అయినా… కంటెంట్ మాత్రం చాలా సీరియస్, పవర్‌ఫుల్, మాస్ టచ్‌లో ఉండబోతోందని స్పష్టమవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: