ఒకప్పుడు బాలీవుడ్ గ్లామర్ ఇండస్ట్రీలో నెమ్మదిగా అడుగులు వేస్తూ, తెలుగులో మాత్రం కొంతకాలంగా కనిపించని స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ ఒకసారి సోషల్ మీడియాలో సుడిగాలి సృష్టిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన వరుస హిట్లు ఇచ్చి, ఇండస్ట్రీని కుదిపేసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‌లో తనదైన ఇమేజ్‌ను నిర్మించుకుంటోంది.“కత్తిలాంటి ఫిగర్” అన్న ట్యాగ్ తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన రకుల్, బాలీవుడ్ బిజీ షెడ్యూల్ కారణంగా తెలుగు సినిమాలకు కొంత దూరంగా ఉన్నా, అభిమానులు మాత్రం ఆమెను ఇప్పటికీ మర్చిపోలేదు.


ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చేసిన కొత్త పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఆమె "మీ బాయ్‌ఫ్రెండ్ మీ వయసులో కాకుండా మీ నాన్న వయసులో ఉంటే ఎలా ఉంటుంది?" అనే పోస్ట్ తో తన రీసెంట్ మూవీ ట్రైలర్‌ను షేర్ చేయడంతో నెటిజన్లు విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు. రకుల్ ఈ పోస్టు ద్వారా తన రాబోయే సినిమా ప్రమోషన్ చేస్తోందని క్లారిటీ ఉన్నప్పటికీ, కొంతమంది నెటిజన్లు దీన్ని సరదాగా తీసుకోగా, మరికొందరు మాత్రం ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.



సోషల్ మీడియాలో కొందరు యూజర్లు,“ఇది ఏంటి రకుల్? నాన్న వయసు ఉన్న అంకుల్‌తో ప్రేమ అంటే విచిత్రంగా ఉంది కదా!”అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే,“ఇది సినిమా స్టోరీలో భాగం కావచ్చు కానీ పోస్ట్ చేసే విధానం కాస్త బోల్డ్‌గా ఉంది”అని కామెంట్ చేస్తున్నారు.అయితే రకుల్ ప్రీత్ సింగ్ పెట్టిన పోస్ట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం మాత్రం "దే దే ప్యార్ దే 2" — తన కొత్త మూవీ ట్రైలర్‌ను పబ్లిసిటీ టచ్‌తో వైరల్ చేయడం.



అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ "దే దే ప్యార్ దే " కి సీక్వెల్ గా వస్తుంది.  అజయ్ దేవగన్ నుంచి వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్‌ ఇది.  అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మ్యూజిక్, కథ, ఎమోషన్ కలయికతో ఈ సినిమా “బాలీవుడ్ చరిత్రను తిరగరాయబోతుంది” అంటూ సినిమా టీమ్ ధీమాగా చెబుతోంది.రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా కీలకమని, కొత్త డైమెన్షన్‌లో ఆమె నటనను చూపిస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. అందుకే, ఈసారి రకుల్ చేసిన బోల్డ్ ప్రమోషన్ సోషల్ మీడియాలో మిక్స్ రియాక్షన్లు తెచ్చినా — ట్రెండ్ మాత్రం సక్సెస్ అయ్యింది.ప్రస్తుతం ఆమె ఈ సినిమాతో పాటు మరికొన్ని వెబ్ ప్రాజెక్ట్స్‌లో కూడా నటిస్తోందని సమాచారం. “సినిమాలు మాత్రమే కాదు, సోషల్ మీడియా పోస్టులు కూడా బోల్డ్‌గా ఉండాలి” అనే రకుల్ సూత్రం ఈ పోస్ట్ ద్వారా మరోసారి స్పష్టమైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: