
అదేమిటంటే ఇందులో హీరోయిన్ అనుష్క కథానాయకగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి చర్చలు కూడా జరిపినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో అనుష్క, నాగార్జున కాంబినేషన్లో సూపర్, డమరుకం, రగడ తదితర చిత్రాలలో నటించగా బాగానే విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా నాగార్జున వందవ సినిమాలో కూడా అనుష్క హీరోయిన్ అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడంతో ఈ విషయం అటు అనుష్క అభిమానులను ,నాగార్జున అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఒక పొలిటికల్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించబోతున్నారు.
అయితే ఈ చిత్రంలో ఒక స్టార్ హీరోయిన్ లేడీ సీఎంగా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అంతేకాకుండా ఈ చిత్రంలో అటు నాగచైతన్య, అఖిల్ కూడా గెస్ట్ రోల్స్ పాత్రలో చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. మరి ఆ లేడీ సీఎంగా నటించే హీరోయిన్ ఎవరా? అనే విషయంపై అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఈ విషయానికి సంబంధించి అధికారికంగా చిత్ర బృందం ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. అనుష్క చివరిగా ఘాటి సినిమాలో నటించగా డిజాస్టర్ గా మిగిలింది.నాగార్జున కూడా ఇటీవల కూలి సినిమాలో కీలకమైన పాత్రలో నటించగా బాగానే క్రేజ్ సంపాదించారు.