నందమూరి నట సింహం బాలకృష్ణ మరి కొంత కాలం లోనే టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కొంత కాలం క్రితం బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబో లో వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా ఇప్పటికే బాలయ్య , గోపీచంద్ కాంబో లో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ మంచి విజయం సాధించడంతో వీరి కాంబో లో రూపొందే నెక్స్ట్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలయ్య , బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. మరికొన్ని రోజుల్లోనే బాలయ్య , గోపీచంద్ మలినేని దర్శకత్వం లో మూవీ ని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గోపీచంద్ , బాలయ్య తో మూవీ స్టార్ట్ చేసిన వెంటనే ఒక భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఆ షెడ్యూల్ లో హై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఇక మొదటి షెడ్యూల్ తోనే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ ను కంప్లీట్ చేసే విధంగా గోపీచంద్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ , బాలయ్య సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులను చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య , గోపీచంద్ కాంబోలో రెండవ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే ఇంకా చాలా కాలం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: