ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ మాట్లాడే మాటలు ఇండస్ట్రీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ సినిమా ఈవెంట్ కి వెళ్లినా సరే ఏదో ఒక విమర్శలు చేసి హైలెట్ అవుతున్నారు.ముఖ్యంగా కొంతమంది అయితే బండ్ల గణేష్ మాట్లాడే మాటల వల్ల సినిమాకి మరింత హైప్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కే ర్యాంప్ సక్సెస్ మూవీ ఈవెంట్ లో భాగంగా చీఫ్ గెస్ట్ గా వచ్చిన బండ్ల గణేష్ మరోసారి తన మార్క్ మాటలతో అందరికీ దడ పుట్టించారు. కే ర్యాంప్ మూవీలో కిరణ్ అబ్బవరం నటన గురించి ఓ రేంజ్ లో పొగుడుతూ కిరణ్ అబ్బవరం హిట్ మీద హిట్లు కొడుతున్నారు. కానీ ఆయనకు కూసింత కూడా గర్వం లేదు. ఆయన్ని చూస్తూ ఉంటే ఒకప్పుడు మెగాస్టార్ ఎలా ఉండేవారో అలాగే అనిపిస్తుంది. ఒకటి తర్వాత ఒకటి హిట్ కొట్టుకుంటూ పోతున్నాడు. కానీ నేను హిట్ స్టార్ హీరోని అయిపోతున్నా అనే గర్వం కనిపించట్లేదు. 

ఇక కొంతమంది హీరోలు ఉంటారు ఒక్క హిట్టుకే స్టేజి మీదకు వచ్చి వాట్సాప్ వాట్సాప్ అంటారు.. ఎక్కడికి వెళ్ళినా కళ్ళజోడు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని గర్వంగా కూర్చుంటారు. నెత్తి మీద క్యాప్ పెడతారు. ఒక హిట్ కే మరీ అంత అవసరం లేదు.లూజు పాయింట్, కొత్త చెప్పులు వేసి తిరుగుతూ ఉంటారు. కిరణ్ అబ్బవరం ఇన్ని హిట్స్ కొట్టినా చాలా ఒద్దికగా ఉంటున్నారు. కొంచెం కూడా గర్వం చూపించడం లేదు. ఈయన్ని చూస్తే అచ్చం చిరంజీవిని చూసినట్టే ఉంటుంది  చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి 150 సినిమాలు చేసిన కూడా ఆయన ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్ లోనే ఉంటారు. రేపు మాపో భారతరత్న తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. నీకు నేను చెప్పేది ఒక్కటే..చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్ళు.. ఎన్ని హిట్స్ వచ్చినా కూడా గర్వపడకు.. నీ స్టైల్ ఏంటి అనేది సినిమాల్లో స్క్రీన్ మీదనే చూపించు. నీ ప్రవర్తన అలాగే ఉంచుకో మార్చుకోకు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ప్రస్తుతం బండ్ల గణేష్ మాటలు వింటుంటే చాలామంది నెటిజన్స్ బండ్ల గణేష్ టార్గెట్ చేసింది విజయ్ దేవరకొండనే అని విజయ్ దేవరకొండపై బండ్ల గణేష్ కి ఎందుకు అంత కోపం అంటూ ఆయన ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండనే ఎక్కువగా వాట్సాప్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అలాగే ఆయన గతంలో ఓ సినిమా ఈవెంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న సమయంలో కూడా విమర్శలు వచ్చాయి.అలాగే నెత్తి మీద క్యాప్ పెట్టి లూజ్ ప్యాంట్ వేసి తిరిగేది కూడా విజయ్ దేవరకొండనే అని మా హీరోనే బండ్ల గణేష్ టార్గెట్ చేశారు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమందేమో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ని బండ్ల గణేష్ టార్గెట్ చేశారని అంటున్నారు. మరి బండ గణేష్ టార్గెట్ చేసింది బన్నీనా లేక విజయ్ దేవరకొండనా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: