అందాల భామ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సినీ ప్రయాణం చూస్తే, ఒక సక్సెస్ స్టోరీలా అనిపిస్తుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పూజా, తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ‘ఒక లైలా కోసం’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘అల వైకుంఠపురములో’, ‘మహర్షి’, ‘అరవింద సమేత’ వంటి భారీ చిత్రాలతో వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంది. తన గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ స్కిల్స్‌తో అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేసింది.ఇక కెరీర్ అగ్రస్థాయిలో ఉన్న సమయంలో, బాలీవుడ్ వైపు దృష్టి సారించింది పూజా హెగ్డే. హిందీ చిత్రాలతో పాన్-ఇండియా లెవెల్‌లో తన పేరు నిలిపే ప్రయత్నం చేసింది. సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’, రణవీర్ సింగ్‌తో ‘సర్కస్’, హృతిక్ రోషన్‌తో ‘మోహెంజోదారో’ వంటి సినిమాలలో నటించింది. అయితే, ఆశించిన స్థాయిలో అక్కడ సక్సెస్ రాకపోవడం పూజా కెరీర్‌ను కొంతమేర వెనక్కి నెట్టింది. బాలీవుడ్‌లో అవ‌కాశాలు తగ్గిపోవడంతో పాటు, సౌత్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి, ఆమె స్థానాన్ని ఆక్రమించడం వల్ల పూజా లైమ్‌లైట్ నుంచి కాస్త దూరమైంది.అయితే ఇప్పుడు మళ్లీ అదే స్టార్‌డమ్‌ను తిరిగి సంపాదించుకునేందుకు ఆమె కఠినంగా శ్రమిస్తోంది. సౌత్‌లో మరోసారి పాజిటివ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని నిర్ణయించుకుని, వరుస సినిమాలు సైన్ చేస్తోంది. తమిళ, తెలుగు, మలయాళ పరిశ్రమలపై దృష్టి పెట్టిన పూజా ప్రస్తుతం మంచి ఆఫర్లను అందుకుంటోంది.


తాజాగా ఆమె విజయ్ హీరోగా నటిస్తున్న భారీ తమిళ చిత్రమైన ‘జన నాయగన్’ లో హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. అలాగే, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తోనూ మరో ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందని సమాచారం. ఈ రెండు సినిమాలతో పూజా మళ్లీ సౌత్ మార్కెట్‌లో బలమైన స్థానాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.అదంతా కాకుండా, రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ‘కాంచన-4’ అనే హారర్ ఎంటర్టైనర్‌లో కూడా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. లారెన్స్ ‘కాంచన’ సిరీస్ సినిమాలు ఎప్పుడూ సూపర్ హిట్స్ కావడంతో, ఈ సినిమాతో పూజా కెరీర్ మళ్లీ ఊపందుకునే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.



ఇక తాజాగా మరో పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ధనుష్ నెక్స్ట్ సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘అమరన్’ ఫేమ్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ డ్రామాలో పూజా ఏ రకమైన పాత్రలో కనిపించబోతుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.పూజా హెగ్డే మరోసారి తన టాలెంట్, గ్లామర్, చార్మ్‌తో సౌత్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలనే తపనతో ముందుకు సాగుతోంది. ఆమె సౌత్‌లో తిరిగి స్థిరపడితే, మళ్లీ టాప్ హీరోయిన్‌గా తన సింహాసనాన్ని తిరిగి పొందే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఏదేమైనా, వరుస సినిమాలతో తన కెరీర్ మళ్లీ పుంజుకోవడమే కాదు, పాన్-ఇండియా స్టార్‌గా మళ్లీ వెలుగులు నింపాలని పూజా ఫ్యాన్స్ తీవ్రంగా ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: