- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాను సెన్సిబుల్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించగా, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది. ప్రేమ, ఎమోషన్, రిలేషన్‌షిప్‌ల మధ్య జరిగే సంఘటనలను చూపించే ఈ సినిమా మోడ్ర‌న్ స్టైల్లో యూత్‌కు బాగా క‌నెక్ట్ అవుతుంద‌న్న ధీమాతో యూనిట్ ఉంది.


తాజాగా సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ / ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అనవసర సన్నివేశాలు లేకుండా తెరకెక్కించిన ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాక, సినిమా రన్‌టైమ్‌ను 2 గంటలు 18 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. సెన్సార్ టాక్‌ను బ‌ట్టి సినిమాలో రష్మిక పాత్ర చాలా డీప్‌గా, ఎమోషనల్‌గా ఉండబోతోందని సమాచారం. ప్రేమలో వచ్చే మలుపులు, ఆత్మగౌరవం, త్యాగం వంటి అంశాలను ఆమె పాత్ర ద్వారా దర్శకుడు చూపించాడని తెలుస్తోంది.


రావు రమేష్, రోహిణి, అను ఇమ్మాన్యుయెల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహీబ్, ఆయన అందించిన మెలోడీ పాటలు ఇప్పటికే యువత హృదయాలను తాకాయి. అల్లు అరవింద్ సమర్పణలో, విద్య కొప్పినీడి మరియు ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు. మొత్తం మీద, ప్రేమతో పాటు భావోద్వేగాలను మేళవించిన ఈ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: