చాలా సంవత్సరాల క్రితం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున , రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన శివ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నాగార్జున కు జోడిగా అమల నటించింది. ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తోనే రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయం అందుకోవడంతో రామ్ గోపాల్ వర్మ కి ఈ సినిమాతో దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇక నాగార్జున కు కూడా ఈ సినిమా సూపర్ సాలిడ్ క్రేజ్ ను తీసుకువచ్చింది. ఇలా ఆ సమయం లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను మళ్ళీ థియేటర్లలో పెద్ద ఎత్తున రి రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను నవంబర్ 14 వ తేదీన రి రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ మూవీ రీ రిలీజ్ కి సంబంధించి ఒక పెద్ద ఈవెంట్ ను కూడా మేకర్స్ నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా మేకర్స్ విడుదల చేశారు. అసలు విషయం లోకి వెళితే ... శివ మూవీ  రీ రిలీజ్ కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను ఈ రోజు అనగా నవంబర్ 4 వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఏ ఏ ఏ సినిమాస్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా రిలీజ్ కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ నే ఈ స్థాయిలో నిర్వహిస్తున్నారు అంటే ఈ మూవీ రీ రిలీజ్ విషయంలో మేకర్స్ చాలా కేర్ తీసుకుంటున్నట్లు ఉన్నారు అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: