మాస్ మహారాజా రవితేజ తాజాగా మాస్ జాతర అనే సినిమాలో హీరో గా నటించాడు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... భాను భోగవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను నవంబర్ 1 వ తేదీన పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను నవంబర్ 1 వ తేదీ కంటే ఒక రోజు ముందు అనగా అక్టోబర్ 31 వ తేదీన పెద్ద ఎత్తున అనేక ప్రాంతాలలో ప్రదర్శించారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజులు బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి ..? మొత్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ..? అనే వివరాలు తెలుసుకుందాం.

రెండు రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 2.60 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 1.12 కోట్లు , ఆంధ్ర లో 2.90 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు రోజుల్లో ఈ సినిమాకు 6.62 కోట్ల షేర్ ... 11.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. రెండు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 45 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్ సిస్ లో 35 లక్షల కలెక్షన్లు దక్కాయి. రెండు రోజుల్లో మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 7.42 కోట్ల షేర్ ... 13.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 20 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 12.58 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టవలసి ఉంది. మరి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లు వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt