నేషనల్ క్రష్ రష్మిక, హీరో దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్లో ఇంటెన్స్ ,ఎమోషనల్ లవ్ స్టోరీ ఉన్నట్లుగా చూపించారు. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్, ధీరజ్ మొగిలినేని బ్యానర్ పైన సంయుక్తంగా నిర్మించారు. ఈ రోజున భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి రివ్యూలో చూద్దాం.


స్టోరీ:
భూమా (రష్మిక) తండ్రి (రావు రమేష్) చాటిన పెరిగిన ఒక అమాయకపు అమ్మాయిగా నటించింది. పై చదువుల కోసం మొదటిసారి తన తండ్రి నుంచి దూరమై కాలేజీకి చేరుతుంది. విక్రమ్ (దీక్షిత్ శెట్టి), దుర్గ (అను ఇమ్మాన్యుయేల్ ) అదే కాలేజీలో చేరుతారు. విక్రమ్ చాలా ఆవేశపరుడే కాకుండా అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలని స్వభావం కలిగిన వ్యక్తి. విక్రమ్ కు నచినట్టుగా భూమా ప్రవర్తన ఉండడంతో ఆమెను ప్రేమిస్తారు. ఆ సమయంలోనే అదే కాలేజీలో చేరిన దుర్గ కూడా విక్రమ్ ని ఇష్టపడుతుంది. అయితే విక్రమ్ మాత్రం ఆమెను రిజెక్ట్ చేస్తారు. లవ్ , రిలేషన్ కు దూరంగా ఉండాలనుకునే భూమ, విక్రమ్ ప్రేమలో పడుతుంది  ఆ తర్వాత భూమా జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఆమె లైఫ్ మొత్తం విక్రమ్ కంట్రోల్ చేస్తున్న సమయంలో భూమా తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయంతో  ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది వాటిని అధికమించి ఎలా సక్సెస్ అయ్యిందనేది ఈ సినిమా కథ.


సినిమా ఎలా ఉందంటే..
కథ చాలా సింపుల్ అండ్ రొటీన్ స్టోరీ గా ఉన్నప్పటికీ డైరెక్టర్ రాహుల్ రవీంద్ర వాటిని తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా చూపించారు. ఇంటర్వెల్ ముందు రష్మిక సీన్, హీరో అమ్మగారితో మాట్లాడుతున్న సీన్స్, బ్రేకప్ తర్వాత హీరో గ్యాంగ్ వెంబడించినప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా డైరెక్టర్ రాహుల్ దర్శకత్వ ప్రతిభను మరొకసారి చాటి చెప్పాయి. ఇవే కాకుండా ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి సినిమా తీసినట్టుగా కనిపిస్తోంది.


మొదటి భాగం హీరో హీరోయిన్ల ప్రేమ చుట్టూ తిరిగితే రెండవ భాగం ప్రేమలో పడిన తర్వాత వారి జీవితాలలో వచ్చేటువంటి మార్పులను చూపించారు. ఊహించగలిగే కథాంశం సన్నివేశాలు చాలాచోట్ల కనిపిస్తాయి, అలాగే ఎమోషనల్ తో పాటు, క్లైమాక్స్ లో హీరోయిన్ చెప్పే మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉంటాయి.

నటీనటులు నటన:
ఈ సినిమాలోని భూమా పాత్రలో రష్మిక అద్భుతంగా నటించింది. రష్మిక తప్ప ఈ పాత్రకు ఎవరు న్యాయం చేయలేరన్నట్టుగా కనిపించింది. ఎమోషనల్, లవ్ సీన్లు అద్భుతంగా నటించింది.విక్రమ్ పాత్రలో దీక్షిత్ శెట్టి కూడా అద్భుతంగా నటించారు. అను ఇమ్మాన్యుయేల్  పాత్ర తక్కువగా ఉన్న బాగానే నటించింది. రావు రమేష్ కూడా తన డైలాగులతో ఎమోషనల్ గా ఆకట్టుకుంటారు. ఈ సినిమా బిజిఎం , పాటలు  ఈ సినిమా స్థాయిని పెంచాయి. అయితే ఈ సినిమా చాలా ల్యాగ్ ఉందనే విధంగా కూడా వినిపిస్తోంది. కొన్ని అనవసరపు సీన్లు  మైనస్ గా ఉన్నాయి.

రేటింగ్:
2.7/5

మరింత సమాచారం తెలుసుకోండి: