ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఎక్కువ శాతం రీ రిలీజ్ అనేవి ఒక హీరో పుట్టిన రోజు వచ్చింది అంటే ఆ హీరో పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తూ వస్తున్నారు. ఇక ఆ హీరో అభిమానులు కూడా తమ అభిమాన నటుడు నటించిన సినిమాను పుట్టిన రోజు నాడు ఆ హీరో నటించిన సినిమా చూడాలి అనే ఉద్దేశంతో ఆ హీరో మూవీ రిలీస్ కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. అలాగే మేకర్స్ కూడా ఓ హీరో పుట్టిన రోజు నాడు ఆ హీరో నటించిన ఏదో ఒక సినిమాను రీ రిలీజ్ చేసి ఆ హీరో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఇక కొన్ని సందర్భాలలో ఒక హీరో నటించిన సినిమా విడుదలకు మధ్య చాలా గ్యాప్ వచ్చినట్లయితే ఆ హీరో అభిమానులను సంతృప్తి పరచడానికి ఆ హీరోకు సంబంధించిన సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు . ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి నటించిన చాలా సినిమాలను కూడా ఇప్పటికే రీ రిలీజ్ చేశారు. అందులో ఇంద్ర , జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ లు రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టాయి. ఇకపోతే చిరంజీవి నటించిన మరో సినిమాను కూడా రీ రిలీజ్ చేయనున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి "కొదమ సింహం" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ ని రీ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను నవంబర్ 21 వ తేదీన రేర్లు చేనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి. ఇక చిరంజీవి నటించిన సినిమా విడుదల అయ్యి చాలా కాలం అవుతుంది. దానితో ఈ మూవీ ఎప్పుడు రీ రిలీజ్ అవుతుందా అని మెగా ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: