చిరంజీవి మాట్లాడుతూ శివ సినిమా చూసిన తర్వాత తాను పూర్తిగా ఆశ్చర్యపోయానని.. నా జీవితంలో అప్పటికి అది పెద్ద షాక్, అది సినిమా కాదు, అదొక విప్లవం వంటిది. ఒక ట్రెండ్ సెట్టర్ అంటూ తెలిపారు. తెలుగు సినిమాకి ఒకసరి కొత్త నిర్వచనం చెప్పి, కొత్త ఒరవడికి నాంది పలికిన చిత్రంగా నిలిచింది శివ. శివ సినిమాలో ఒక షాట్ తాను ఇప్పటికీ మర్చిపోలేనని, అదే సైకిల్ చైన్ లాగే సిన్ అదొక కల్ట్ క్లాసికల్ సీన్ అని ఇప్పటికీ నా మనసులో అలాగే నిలిచిపోయిందంటూ తెలిపారు చిరంజీవి.
నాగార్జున తన నటనలోని తీవ్రత , నాగార్జున చూసినటువంటి చూపుల తీరు కూడా చాలా ఫెంటాస్టిక్. హీరోయిన్ అమల, విలన్ రఘువరన్ కూడా ప్రతి ఒక్కరు తమ పాత్రకి ప్రాణం పోసి మరి నటించారు. శివ సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతోందని తెలిసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించిందని నేటితరం యువతకు ఈ సినిమా గురించి తెలుసుకోవాలని, ఈ కల్ట్ క్లాసికల్ సినిమా సృష్టించడం వెనుక ముఖ్యమైన వ్యక్తి రాంగోపాల్ వర్మ అంటూ తెలిపారు. ఈ సినిమా విజువల్స్, కెమెరా యాంగిల్స్, ఆయన విజన్ చాలా కొత్తగా అనిపించాయి. చెన్నైలో ఈ సినిమా చూసిన తర్వాత వర్మ అభినందించానని ,ఒక పూల బొకే కూడా పంపించానని తెలిపారు. ఆ తర్వాత ఫోన్ చేసి అభినందించానని తెలిపారు చిరంజీవి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి