ఇటీవ‌ల కాలంలో ఒక సినిమా తెరకెక్కించాలంటే చాలా ఖర్చు అవుతోంది. హీరో, హీరోయిన్లే కాదు.. డైరెక్ట‌ర్లు.. టెక్నీషియ‌న్ల రెమ్యున‌రేష‌న్లు విప‌రీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడ హై బ‌డ్జెట్ సినిమాలు తీస్తున్నా నిర్మాత‌ల‌కు లాభాలు రావ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో టాప్ 10 భారీ బ‌డ్జెట్ సినిమాలు ఏంటో చూద్దాం.
1) కల్కి 2898AD :
ఇప్పటివరకు వచ్చిన ఇండియన్ సినిమాల్లో హైయ్యెస్ట్ బడ్జెట్ పెట్టిన తొలి సినిమా ఖ‌చ్చితంగా కల్కి 2898 ఏడి.. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కుడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పదుకొనే లాంటి దిగ్గ‌జ న‌టులు న‌టించ‌డంతో వారి రెమ్యున‌రేష‌న్‌కే చాలా బ‌డ్జెట్ అయ్యింది.
2) ఆర్ ఆర్ ఆర్ :
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకి 550 కోట్ల బడ్జెట్ పెట్టారు.
3) ఆదిపురుష్ :
రామాయణ ఇతిహాస కథ ఆధారంగా తెరకెక్కిన ఆది పురుష్ మూవీకి రు. 550 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటించారు. చివరికి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.


4) రోబో 2.0 :
రజినీకాంత్ హీరోగా వచ్చిన రోబో సినిమాకు సీక్వెల్ గా రోబో 2.0 తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అలా ఈ మూవీకి ఏకంగా 550 కోట్లు పెట్టినా అంచ‌నాలు అందుకోలేదు.
5) పుష్ప-2:
సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 రు. 500 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది. ఈ సినిమా ఏకంగా రు. 1800 కోట్ల కలెక్షన్లు కొల్ల‌గొట్టింది.
6) ది గోట్ :
తమిళ హీరో విజయ్ దళపతి హీరోగా వచ్చిన ది గోట్ కు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా నిర్మాత‌లు సేఫ్ అయ్యారు. ఈ సినిమాకు 380 కోట్ల బడ్జెట్ పెట్టారు.
7) బ్రహ్మాస్త్ర :
రణ్బీర్ కపూర్, అలియా భట్తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా న‌టించిన బ్రహ్మాస్త్ర మూవీకి ఏకంగా 350 కోట్ల బడ్జెట్ పెట్టారు. విఎఫ్ఎక్స్ ఎక్కువగా వాడడంతో ఇంత బడ్జెట్ ఖర్చయింది.


8) గేమ్ ఛేంజర్:
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాకి ఏకంగా 350 కోట్ల బడ్జెట్ పెడితే రు.150 కోట్లు కూడా రాలేద‌ని ఇన్‌సైడ్ టాక్‌. ఈ సినిమా నిర్మాతలు భారీగా నష్టపోయారు.
9) కూలీ:
రజినీకాంత్ కూలీ కి కూడా దాదాపు 350 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఈ సినిమాలో నాగార్జున,ఉపేంద్ర లాంటి దిగ్గజ నటులు కూడా నటించడంతో సినిమాకి భారీ హైప్ ఏర్పడినా మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. అయినా కూడా రు. 500 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి.
10) వార్-2 :
ఎన్టీఆర్ మొట్టమొదటి బాలీవుడ్ ఫిల్మ్ వార్ 2.. హృతిక్ రోషన్,ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్-2 మూవీ 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినా ప్లాప్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: