దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “రమణి కళ్యాణం. ఈరోజు చిత్రబృందం అధికారికంగా టైటిల్ లుక్‌ను లాంచ్ చేశారు. కిరణ్ అబ్బవరం , వశిష్ట , విజయ్ ఆంటోని , జి.వి. ప్రకాశ్ కుమార్ , సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి వంటి ప్రముఖులు టైటిల్ ని లాంచ్ చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితంలోని సవాళ్ల మధ్య ప్రేమ, విలువలు, హృదయాన్ని తాకే ఎమోషన్స్ తో అందమైన ప్రయాణం గా ఈ సినిమా ఉండబోతోంది. వినోదం, భావోద్వేగం, విలువలతో కూడిన కథను నిజాయితీగా చెప్పబోతోతున్నారు.
ఈ చిత్రాని కి సూరజ్ ఎస్ . కురుప్ మ్యూజిక్ అందిస్తున్నారు. అరవింద్ తిరుకోవెల డీవోపీ, రవితేజ గిరిజాల ఎడిటర్. యువరాజ్ తేజ కాండ్రకోట, రామ్ జగదీష్, విజయ్ ఆదిరెడ్డి స్క్రీన్ ప్లేని అందిస్తున్నారు. కోర్ట్ సినిమా తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ రామ్ జగదీష్ ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. “రమణి కళ్యాణం” తన అందమైన ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభించింది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లాంటి ఆసక్తికర అప్‌డేట్స్ రానున్నాయి. ఈ సినిమా పై మంచి అంచనాలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ , తెలంగాణ లో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాల ను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరు కు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి