టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం తాజాగా కే ర్యాంప్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేయడం కష్టం అని ఈ మూవీ తో కిరణ్ కి మరో అపజయం దక్కుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ కి నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది.

దానితో ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ పోలిస్తే భారీ కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ మూవీ చాలా లాభాలను అందుకొని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో కిరణ్ అబ్బవరం కు మంచి విజయం దక్కింది. ఇలా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ఆహా సంస్థ వారు దక్కించుకున్నారు. తాజాగా ఆహా సంస్థ వారు ఈ సినిమాను నవంబర్ 15 వ తేదీ నుండి ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కే ర్యాంప్ మూవీ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: